హీరో బెల్లంకొండ గణేష్ నేను స్టూడెంట్ సర్ తో మరోసారి ప్రేక్షకులను అలరించబోతున్నారు. గ్రాండ్ గా జరిగిన టీజర్ లాంచ్ ఈవెంట్ లో దర్శకుడు వివి వినాయక్ టీజర్ ను విడుదల చేశారు.
టీజర్ లాంచ్ ఈవెంట్ లో దర్శకుడు వివి వినాయక్ మాట్లాడుతూ.. “సతీష్ గారు తీసిన నాంది సినిమా చూశాను. ఎక్కడా రాజీపడకుండా మంచి కంటెంట్ తో తీశారు. ఇప్పుడు సతీష్ గారి సంస్థలో గణేష్ సినిమా చేయడం చాలా ఆనందంగా వుంది. నేను స్టూడెంట్ సర్! టీజర్ చాలా బావుంది. ఈ సినిమాతో గణేష్ కి మరో విజయం రావాలని కోరుకుంటున్నాను. అవంతిక ఈ సినిమాతో హీరోయిన్ గా పరిచయమౌతుంది. వాళ్ళ అమ్మగారు భాగ్యశ్రీలానే అవంతిక కూడా మంచి పేరు తెచ్చుకోవాలని కోరుకుంటున్నాను. దర్శకుడు రాఖీ తో పాటు ఈ చిత్రానికి పని చేస్తున్న నటీనటులు, సాంకేతిక నిపుణులందరికీ బెస్ట్ విషెస్” తెలిపారు.