రీసెంట్గా సెట్స్‌పైకి వెళ్లిన NC22 సినిమా మైసూర్లో కీలక షెడ్యూల్‌ని పూర్తి చేసుకుంది. ఈ షెడ్యూల్లో నాగ చైతన్యకు సంబంధించిన కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. మైసూర్‌లోని అందమైన లొకేషన్లలో ఈ షెడ్యూల్‌ను పూర్తి చేసింది చిత్రబృందం. ఈ చిత్రంలో నాగ చైతన్య పూర్తిగా భిన్నమైన అవతార్‌లో కనిపించనున్నారు. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.