Friday - April 19, 2024
Friday - April 19, 2024
For advertising email us: [email protected]

‘Of the cinema, by the cinema, for the cinema’ is our motto.
We are the all-in-one destination for cine maniacs.

ట్రెండింగ్ లోకి బాయ్ కాట్ లైగర్, కౌంటర్ గా ఐ సపోర్ట్ లైగర్, అన్ స్టాపబుల్ లైగర్ ట్రెండింగ్స్

Written by:

Liger movie
(Photo: PR)

బాయ్ కాట్ ట్రెండింగ్ బాలీవుడ్ లో కొనసాగుతోంది. ఇటీవల ఆమిర్ ఖాన్ లాల్ సింగ్ చద్దా, అక్షయ్ కుమార్ రక్షా బంధన్, తాప్సీ దొబారా చిత్రాలకు ఈ బాయ్ కాట్ యాష్ ట్యాగ్ ట్రెండింగ్ లోకి వచ్చింది. సినిమాలను బహిష్కరించాలని సోషల్ మీడియాలో కొందరు చేస్తున్న ప్రచారాన్ని బాలీవుడ్ స్టార్స్ ఖండిస్తున్నారు. ఇది సరైన చర్య కాదని అంటున్నారు. ఈ క్రమంలో విజయ్ దేవరకొండ నటించిన పాన్ ఇండియా మూవీ లైగర్ ను కూడా బాయ్ కాట్ చేయాలనే యాష్ ట్యాగ్ ను ట్రెండింగ్ లోకి తీసుకొచ్చారు. దీనికి కౌంటర్ గా అభిమానులు, సినీ ప్రియులు ఐ సపోర్ట్ లైగర్, అన్ స్టాపబుల్ లైగర్ అనే యాష్ ట్యాగ్ లను ట్రెండింగ్ చేస్తున్నారు. బాయ్ కాట్ లైగర్ కు ధీటుగా లైగర్ కావాలంటూ అవుతున్న ట్రెండింగ్స్ కే ప్రేక్షకుల సపోర్ట్ లభిస్తోంది. లైగర్ బాయ్ కాట్ అనే దాన్ని ఎందుకు ట్రెండింగ్ చేస్తున్నారు, ఇది కరణ్ జోహార్ ప్రాజెక్ట్ అనా లేక ఏ బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఎదిగిన హీరోలకు వస్తున్న క్రేజ్ చూడలేకా అని విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. లైగర్ కున్న క్రేజ్ వాస్తవం, దీన్నెవరూ ఆపలేరని వారంటున్నారు.

బాలీవుడ్ లో ఈ మధ్య సినిమాలు సరైన విజయాలు సాధించడం లేదు. స్టార్స్ సినిమాలకూ వసూళ్లు రావడం లేదు. అయితే పాండమిక్ తర్వాత ఏర్పడిన అంతు పట్టని పరిస్థితి ఇది. ఈ సిట్యువేషన్ త్వరలోనే పోతుందని, మళ్లీ బాలీవుడ్ కు మంచి రోజులు వస్తాయని హిందీ స్టార్స్ చెబుతున్నారు. వేల మంది ఆధారపడిన అతి పెద్ద ఫిల్మ్ ఇండస్ట్రీ సినిమాలను బాయ్ కాట్ చేయాలని పిలువు ఇవ్వడం అర్థం లేని పనిగా వారంటున్నారు. లైగర్ కు దేశవ్యాప్తంగా క్రేజ్ ఏర్పడింది. ఎక్కడికి వెళ్లినా ప్రజలు ఈ సినిమా టీమ్ ను చూసేందుకు ఎగబడుతున్నారు. ఈ క్రేజ్ తట్టుకోలేని కొందరు బాలీవుడ్ బిగ్గెస్ట్ మూవీస్ తో పాటు లైగర్ ను కూడా టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. అయితే అభిమానులు, సినీ ప్రియులు దీనికి బలమైన కౌంటర్ ఇస్తున్నారు.

Social Share

Related Posts

Galleries