Sunday - April 2, 2023
Sunday - April 2, 2023

For advertising email us: [email protected]

‘Of the cinema, by the cinema, for the cinema’ is our motto.
We are the all-in-one destination for the cine maniacs.

చెన్నైలో షూటింగ్ జరుపుకుంటున్న వారసుడు

Written by:

విజయ్ కధానాయకుడిగా, వంశీ పైడిపల్లి దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్ పై నిర్మాతలు దిల్ రాజు, శిరీష్, పీవీపీ బ్యానర్ పై పరమ్ వి పొట్లూరి, పెరల్ వి పొట్లూరి సంయుక్తంగా నిర్మిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం వారసుడు/వారిసు. ఈ చిత్రం చెన్నైలో షూటింగ్ జరుపుకుంటుంది. తాజాగా ఈ చిత్రానికి సంబధించిన స్టిల్స్ ఒకేసారి విడుదల చేశారు. వీటిలో విజయ్ తో పాటు రష్మిక, ఖుష్బూ కూడా కొత్త లుక్స్ లో కనిపించారు. అలాగే  విజయ్, వెటరన్ హీరోయిన్ జయసుధ, దర్శకుడు వంశీ పైడిపల్లి షూటింగ్ లొకేషన్ వర్కింగ్ స్టిల్స్ కూడా ఆకట్టుకున్నాయి.

 

2023 సంక్రాంతికి వారసుడు/వారిసుని  విడుదల చేస్తున్నట్లు  దీపావళి పండగ నాడు మేకర్స్ ప్రకటించారు. తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడులో కూడా సంక్రాంతి అతిపెద్ద పండుగ కావడంతో భారీ స్థాయిలో సినిమాని విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్స్ చేస్తున్నారు. పూర్తిస్థాయి ఎంటర్‌టైనర్‌గా రూపొందించబడిన ఈ చిత్రంలో ప్రభు, శరత్ కుమార్, ప్రకాష్ రాజ్, జయసుధ, శ్రీకాంత్, షామ్, యోగి బాబు, సంగీత, సంయుక్త ఇతర ముఖ్య తారాగణం.

 

సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా, కార్తీక్ పళని ఛాయాగ్రాహకుడిగా, కెఎల్ ప్రవీణ్ ఎడిటర్ గా, శ్రీ హర్షిత్ రెడ్డి, శ్రీ హన్షిత సహ నిర్మాతలుగా, సునీల్ బాబు, వైష్ణవి రెడ్డి ప్రొడక్షన్ డిజైనర్లుగా పని చేస్తున్నారు.

 

 

 

Social Share

Related Posts

Galleries