Monday - May 27, 2024
Monday - May 27, 2024
For advertising email us: [email protected]

‘Of the cinema, by the cinema, for the cinema’ is our motto.
We are the all-in-one destination for cine maniacs.

బబ్లీ బౌన్సర్ స్క్రిప్ట్ దక్కటం నా అదృష్టం: తమన్నా

Written by:

తమన్నా లేడీ బౌన్సర్‌గా నటిస్తున్న లేటెస్ట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ఫిలిం బబ్లీ బౌన్సర్. జాతీయ అవార్డు గ్రహీత దర్శకుడు మధుర్ భండార్కర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని స్టార్ స్టూడియోస్ మరియు జంగిలీ పిక్చర్స్ నిర్మించాయి. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొన్న ఈ చిత్రాన్ని సెప్టెంబర్‌ 23న డిస్నీ+ హాట్‌స్టార్‌లో గ్రాండ్ గా విడుదల చేస్తున్నారు.

 

ఈ సందర్బంగా తమన్నా మాట్లాడుతూ.. “తెలుగు సినిమా అంటే నేను గర్వంగా ఫీల్ అవుతున్నాను. నా జర్నీ తెలుగు నుండే సార్ట్ ఆయ్యింది. రాజమౌళి, సుకుమార్ లు అందరూ మన ఇండియన్ రూట్స్ కథలు తీసుకొని చేస్తుంటారు. ఇప్పటికీ మన ఇండియన్ సినిమాను మన ఏమోషన్సే నడిపిస్తాయి. తొలి సారిగా లేడీ బౌన్సర్ కాన్సెప్ట్ తో వస్తున్న ఈ స్క్రిప్ట్ నాకు దొరకడం నా అదృష్టం. పలు సార్లు జాతీయు అవార్డ్స్ పొందిన మధుర్ భండార్కర్ సర్ తో చేసే అవకాశం వచ్చిందుకు చాలా గ్రేట్ గా ఫీల్ అవుతున్నాను. ఈ సినిమాలో హరియాణాకు చెందిన యువతిగా నటించాను. తప్పకుండా ఈ సినిమా నా కేరీర్ లో బెస్ట్ సినిమా అవుతుంది. మధుర్ బండార్కర్ సినిమాలో నటించిన హీరోయిన్స్ కు జాతీయ అవార్డ్స్ వస్తాయి. నాకు కూడా ఈ చిత్రానికి అవార్డ్స్ రావాలని దేవుణ్ణి కోరుకుంటున్నాను. ఈ నెల 23న డిస్నీ+ హాట్‌స్టార్‌ లో విడుదల అవుతున్న ఈ సినిమా ను కుటుంబ సమేతం గా ఇంట్లో కూర్చొని హ్యాపీ గా చూడండి” అన్నారు.

Social Share

Related Posts

Galleries