వరాహ స్వామి శక్తి నుండి ఉద్భవించిన వారాహి అమ్మ వారి ఆలయ నేపథ్యంతో, సుమంత్ హీరోగా వారాహి చిత్రాన్ని రూపొందిస్తున్నారు దర్శకుడు సంతోష్ జాగర్లపూడి. వీరి కాంబినేషన్ లో గతంలో సుబ్రహ్మణ్యపురం అనే సినిమా రూపొందింది. ఈ సినిమా మంచి విజయం సాధించిన నేపథ్యంలో సుమంత్, సంతోష్ జాగర్లపూడి కొత్త చిత్రం వారాహిపై ఆసక్తి ఏర్పుడుతోంది. ఈ చిత్రాన్ని జీకే మూవీ మేకర్స్ పతాకంపై రమాదేవి నారగాని నిర్మిస్తున్నారు. సోమవారం హైదరాబాద్ లోని రామానాయుడు స్టూడియోలో పూజా కార్యక్రమాలతో ఈ సినిమా లాంఛనంగా ప్రారంభమైంది. దర్శకుడు వీవీ వినాయక్ ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ నిచ్చారు. నిర్మాత సురేష్ బాబు కెమెరా స్విచ్ఛాన్ చేశారు. డివోషనల్ బేస్డ్ మూవీగా ఓ సరికొత్త కాన్సెప్ట్ తో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు చిత్రబృందం తెలిపారు.
