Monday - May 27, 2024
Monday - May 27, 2024
For advertising email us: [email protected]

‘Of the cinema, by the cinema, for the cinema’ is our motto.
We are the all-in-one destination for cine maniacs.

శ్రీ విష్ణు-రామ్ అబ్బరాజు నూతన చిత్రం ప్రారంభం

Written by:

హీరో శ్రీవిష్ణు, వివాహ భోజనంబు(ఓటీటీ ప్రాజెక్ట్) తో ఆకట్టుకున్న దర్శకుడు రామ్ అబ్బరాజుతో చేతులు కలిపారు. హాస్య మూవీస్ పతాకంపై  రాజేష్ దండా నిర్మాణంలో ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని అనిల్ సుంకర  సమర్పిస్తున్నారు. పూర్తి ఫన్‌ఫుల్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందనున్న ఈ సినిమా గ్రాండ్‌గా లాంచ్ అయింది. ప్రారంభోత్సవ కార్యక్రమంలో అనిల్ సుంకర, వీఐ ఆనంద్, నారా రోహిత్, విజయ్ కనకమేడల, ఏఆర్ మోహన్ పాల్గొన్నారు. ముహూర్తం షాట్‌కు నారా రోహిత్ క్లాప్‌ ఇచ్చారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది.

 

ఈ చిత్రానికి భాను బోగవరపు కథని అందించగా, నందు సవిరిగాన డైలాగ్స్‌ అందిస్తున్నారు. దర్శకుడు రామ్ అబ్బరాజు ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే రాశారు. అత్యున్నత సాంకేతిక నిపుణుల బృందం ఈ చిత్రానికి పని చేస్తోంది. గోపీ సుందర్ సంగీతం అందిస్తుండగా, రామ్ రెడ్డి సినిమాటోగ్రాఫర్ గా, ఛోటా కె ప్రసాద్ ఎడిటర్ గా బ్రహ్మ కడలి ఆర్ట్ డైరెక్టర్ గా పని చేస్తున్నారు.

Social Share

Related Posts

Galleries