Sunday - March 3, 2024
Sunday - March 3, 2024
For advertising email us: [email protected]

‘Of the cinema, by the cinema, for the cinema’ is our motto.
We are the all-in-one destination for cine maniacs.

యశోద టీజర్ విడుదల

Written by:

సమంత ప్రధాన పాత్రలో నటించిన సినిమా యశోద. శ్రీదేవి మూవీస్ పతాకంపై ప్రొడక్షన్ నెం.14గా శివలెంక కృష్ణప్రసాద్ నిర్మిస్తున్నారు. హరి – హరీష్ ఈ చిత్రానికి దర్శకులు. వరలక్ష్మీ శరత్ కుమార్, ఉన్ని ముకుందన్, రావు రమేష్, మురళి శర్మ, సంపత్ రాజ్ కీలక పాత్రలు పోషించారు. ఈ రోజు సినిమా టీజర్ విడుదల చేశారు.

యశోదలో సమంత గర్భవతిగా కనిపించనున్నారని టీజర్ ద్వారా చెప్పారు. గర్భిణీ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో లేడీ డాక్టర్ ఆమెకు చెబుతుంటే… అందుకు విరుద్ధంగా ఆమె జీవితంలో ఘటనలు జరుగుతున్నట్లు టీజర్‌లో చూపించారు. ఈ సినిమాలో ఉన్ని ముకుందన్ డాక్టర్ రోల్ చేస్తున్నారు. టీజ‌ర్‌లో కంటెంట్ మాత్రమే కాదు, క్వాలిటీ అవుట్‌పుట్ కూడా ఉంది. విజువల్స్ రిచ్‌గా ఉన్నాయి. లొకేషన్స్ అట్ట్రాక్ట్ చేశాయి. మణిశర్మ నేపథ్య సంగీతం ఉత్కంఠ పెంచింది. ఇందులో సమంత చాలా కొత్తగా కనిపించారు. త్వరలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

 

టీజర్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Social Share

Related Posts

Galleries