Monday - May 27, 2024
Monday - May 27, 2024
For advertising email us: [email protected]

‘Of the cinema, by the cinema, for the cinema’ is our motto.
We are the all-in-one destination for cine maniacs.

సమంత ఒప్పుకుంటే యశోద సీక్వెల్స్ చేస్తాం: సక్సెస్ మీట్‌లో చిత్ర దర్శకనిర్మాతలు

Written by:

సమంత టైటిల్ పాత్రలో నటించిన సినిమా యశోద. శ్రీదేవి మూవీస్ పతాకంపై ప్రముఖ నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మించారు. హరి, హరీష్ దర్శకత్వం వహించారు. గత శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో సినిమా విడుదలైంది. అన్ని భాషల్లో ప్రేక్షకుల నుంచి సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఫస్ట్ డే ఆరున్నర కోట్ల గ్రాస్ వసూలు చేసింది. మూడు రోజుల్లో 20 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది. అమెరికాలో హాఫ్‌ మిలియన్ మార్క్ చేరుకుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో సక్సెస్ మీట్ నిర్వహించారు.

 

నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ మాట్లాడుతూ, ”సమంత గారి వన్ విమన్ షో యశోద. స్క్రిప్ట్ వర్క్ కంప్లీట్ అయిన తర్వాత టైటిల్‌ రోల్‌కి సమంత గారయితే బావుంటుందని అనుకున్నాం. ఆమెకు వెళ్లి చెప్పిన  వెంటనే ఓకే చేశారు. కథ మీద నమ్మకంతో అన్ని భాషల్లో  చేస్తే బావుంటుందని అనుకున్నాం. సమంత గారు అద్భుతం. ఆవిడ మాకు ఎనర్జీ ఇచ్చారు. ప్రతి ఒక్కరి జీవితంలో మబ్బులు ఉంటాయి. ఇప్పుడు ఆవిడ ఎదుర్కొంటున్నదీ అంతే! ఆవిడ మళ్ళీ సూపర్ ఎనర్జీతో వస్తారు. యశోద 2 గురించి చాలా మంది అడుగుతున్నారు.  ప్రపంచంలో ఎప్పటికప్పుడు కొత్తగా క్రైమ్స్ పుట్టుకు వస్తున్నాయి. వాటికి పరిష్కరాలూ  ఉంటాయి. యశోద సీక్వెల్ ప్రయత్నం హరి, హరీష్ నుంచి రావాలి. యశోదకు ట్రెమండస్‌ రెస్పాన్స్ వస్తోంది. ఫస్ట్ డే స్లోగా స్టార్ట్ అయిన  సినిమా… ఆ రోజు సాయంత్రానికి మౌత్‌టాక్‌తో హౌస్‌ఫుల్స్ తెచ్చుకుంది. శని, ఆదివారాలు అయితే ప్రభంజనమే. ఒక హీరోయిన్‌ ఓరియంటెడ్‌ సినిమాకు ఈ రేంజ్‌ రెస్పాన్స్, యుఎస్‌లో ఈ రేంజ్‌ కలెక్షన్లను ఎవరూ ఊహించలేదు. మంచి సినిమా తీస్తే విజయం అందిస్తామని కాన్ఫిడెన్స్ ఇచ్చిన ప్రేక్షకులకు థాంక్స్. సినిమాకు పని చేసిన ప్రతి ఒక్కరూ అద్భుతంగా చేశారు. పాటలు లేకుండా సినిమా ఏంటని మణిశర్మ అడిగితే ‘రీ రికార్డింగ్ అద్భుతంగా చేస్తావ్. అదరగొడతావ్’ అని చెప్పాను. అద్భుతంగా చేశారు మణి. ఒక ప్రమోషనల్ సాంగ్ చేశాం. త్వరలో విడుదల చేస్తాం. యశోదను ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమా అనుకోలేదు. కొత్త పాయింట్‌ని ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకంతో చేశాం. మా నమ్మకాన్ని ప్రేక్షకులు నిజం చేశారు. ముఖ్యంగా ఈ సినిమా విషయంలో నాకు మా సహ నిర్మాత చింతా గోపాలకృష్ణ రెడ్డి గారు ఎంతో సపోర్ట్ చేశారు. ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్లు రాజా సెంథిల్‌, రవికుమార్‌ సహకారం మరువలేను. ప్రతి ఒక్కరూ సినిమాను ప్రేమించి పనిచేశారు” అని అన్నారు.

 

దర్శకులు హరి, హరీష్ మాట్లాడుతూ, ”తెలుగులో మాకు  ఇది తొలి సినిమా. అన్ని భాషల నుంచి వస్తున్న స్పందన  ఎంతో సంతోషాన్నిచ్చింది. మాకు ఇది చాలా మ్యాజికల్ మూమెంట్.  అవకాశం ఇచ్చిన కృష్ణప్రసాద్ గారికి థాంక్స్. సమంత గారికి చాలా పెద్ద థాంక్స్. ఆవిడ మాకు ఎంతో సపోర్ట్ చేశారు. వరలక్ష్మీ గారు వెర్సటైల్ యాక్టర్. మణిశర్మ గారు అద్భుతమైన నేపథ్య సంగీతం అందించారు. మా కలను తమ ఆర్ట్ వర్క్ ద్వారా నిజం చేసిన అశోక్ గారికి థాంక్స్. సుకుమార్ గారు హాలీవుడ్ స్థాయి విజువల్స్ ఇచ్చారు. ఈ సినిమాలో నటించిన ప్రతి ఒక్కరికి, పని చేసిన సాంకేతిక నిపుణులకు థాంక్స్. యశోద 2కు విషయంలో మాకు ఒక ఐడియా ఉంది. సెకండ్ పార్ట్, థర్డ్ పార్ట్‌కు లీడ్ కూడా ఉంది. అయితే… అది సమంత గారిపై ఆధారపడి ఉంది. పూర్తి ఆరోగ్యంతో తిరిగి వచ్చిన తర్వాత, ఆవిడతో డిస్కస్ చేస్తాం. సమంతగారు ఒప్పుకుంటే సీక్వెల్స్ చేస్తాం. మా నిర్మాత గారూ రెడీగా ఉన్నారు. యశోద 2లో వరలక్ష్మి గారి క్యారెక్టర్ కూడా ఉంటుంది.  మా సినిమాలో సూపర్‌సైంటిస్ట్ ఉన్నిముకుందన్‌ ఉన్నారు. అతను ఏమైనా చేయగలడు (నవ్వుతూ). యాక్షన్ డైరెక్టర్స్ యానిక్ బెన్, వెంకట్ గారు ఇంట్రెస్టింగ్ ఫైటింగ్స్ కంపోజ్ చేశారు. మాటల రచయితలు పులగం చిన్నారాయణ గారు, డా.  చల్లా భాగ్యలక్ష్మి గారికి స్పెషల్ థాంక్స్. ఇదొక సోషల్ అవేర్నెస్ ఫిల్మ్. కమర్షియల్ పంథాలో తీసినప్పటికీ… ఎమోషన్ ఉంది. ఆ భావోద్వేగాలు అందరికీ రీచ్ అయ్యేలా మాటలు రాశారు. క్రియేటివ్ డైరెక్టర్ హేమాంబర్ జాస్తి గారికి థాంక్స్” అని అన్నారు.

Social Share

Related Posts

Galleries