Monday - May 27, 2024
Monday - May 27, 2024
For advertising email us: [email protected]

‘Of the cinema, by the cinema, for the cinema’ is our motto.
We are the all-in-one destination for cine maniacs.

సినిమాలపై చిరంజీవి గారికి వున్న ప్రేమ వల్లనే గాడ్ ఫాదర్ చేశాను: సల్మాన్ ఖాన్

Written by:

చిరంజీవి, సల్మాన్ ఖాన్‌ కలసి నటించిన యాక్షన్ ఎంటర్‌టైనర్ గాడ్ ఫాదర్. మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్నారు. కొణిదెల సురేఖ సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్స్, సూపర్ గుడ్ ఫిలింస్ బ్యానర్‌లపై ఆర్‌బి చౌదరి, ఎన్‌వి ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. అక్టోబర్ 5న దసరా కానుకగా ప్రపంచవ్యాప్తంగా తెలుగు, హిందీలో గ్రాండ్ గా విడుదల కానున్న ఈ చిత్రం హిందీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ముంబైలో గ్రాండ్ జరిగింది.

 

ఈ ఈవెంట్ లో మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ, “గాడ్ ఫాదర్లో ఒక బలమైన పాత్ర వుంది. లూసిఫర్ లో ఆ పాత్రని చిత్ర దర్శకుడు పృథ్వీరాజ్ సుకుమారన్ చేశారు. గాడ్ ఫాదర్ లో ఈ పాత్రని సల్మాన్ భాయ్ చేస్తే బావుంటుందని భావించాం. మేము కోరగానే ‘నేను చేయాలని మీరు కోరినట్లయితే మరో ఆలోచన లేకుండా చేస్తాను. మీరు ఇంకేం అలోచించకండి. నేను చేస్తాను’ అని మాపై ఎంతో ప్రేమ చూపించారు సల్మాన్ భాయ్. సల్మాన్ భాయ్  ఓకే చేసిన తర్వాత ఈ సినిమా ఆరా మరింతగా పెరిగింది. షూటింగ్ లో మాకు ఎంతగానో సహకరించారు. సల్మాన్ భాయ్ గాడ్ ఫాదర్ లోకి రావడం.. ఈ సినిమా తప్పకుండా విజయం సాధిస్తుందని చెప్పడానికి తొలిమెట్టు. మాపై ఎంతో ప్రేమ, ఆప్యాయతతో ఈ సినిమా చేశారు. సల్మాన్ భాయ్ తో కలసి ఈ సినిమాని చాలా జోష్ ఫుల్ గా చేశాను. ఆ జోష్ ని తెరపై చూస్తారు” అన్నారు.

 

సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ మాట్లాడుతూ, “చిరంజీవి గారు ఈ సినిమా గురించి చెప్పగానే మరో ఆలోచన లేకుండా ఓకే చెప్పాను.  సినిమాల పట్ల చిరంజీవి గారికి, మాకున్న ప్రేమ దీనికి కారణం. చిరంజీవి గారితో నటించడం మంచి అనుభవం. ఇందులో చాలా కొత్త పాత్ర చేశాను. మల్టీస్టారర్లు చేయడానికి నేను ఎప్పుడూ సిద్ధంగానే వుంటాను. మల్టీ స్టార్ చిత్రాలు చేయడం పరిశ్రమకు మంచింది. సినిమాలని నార్త్ సౌత్ అనే తేడా లేకుండా ప్రపంచమంతా చూస్తారు. నెంబర్స్ పెరుగుతాయి. గాడ్ ఫాదర్ నా తొలి తెలుగు సినిమా. ప్రేక్షకులని కచ్చితంగా అలరిస్తుంది” అన్నారు.

 

Social Share

Related Posts

Galleries