కబాలి ఫేమ్ సాయి ధన్సిక ప్రధాన పాత్రలో రూపొందుతోన్న లేడీ ఓరియెంటెడ్ సస్పెన్స్ థ్రిల్లర్ దక్షిణ. ఓషో తులసీరామ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని కల్ట్ కాన్సెప్ట్స్ పతాకంపై అశోక్ షిండే నిర్మిస్తున్నారు. ఈ రోజు పూజా కార్యక్రమాలతో సినిమా ప్రారంభమైంది. నేడు రెగ్యులర్ షూటింగ్ సైతం స్టార్ట్ చేశారు. హైదరాబాద్‌లో ఈ రోజు నుంచి ఈ నెల 24 వరకు షూటింగ్ జరుగుతుంది. రెండో షెడ్యూల్ గోవాలో అక్టోబర్ 6 నుంచి 20వ తేదీ వరకు ప్లాన్ చేశారు. మూడో షెడ్యూల్ హైదరాబాద్‌లో నవంబర్ 1 నుంచి 10 వరకు జరుగుతుంది.
