రాఘవ లారెన్స్ కధానాయకుడిగా, కతిరేసన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ థ్రిల్లర్ రుద్రుడు. షూటింగ్ పార్ట్ పూర్తిచేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో వుంది. రుద్రుడు 2023లో ఏప్రిల్ 14న థియేటర్స్ లో అలరించనుంది.
రాఘవ లారెన్స్ బర్త్ డే కానుకగా రుద్రుడు భారీ యాక్షన్ గ్లింప్స్ ని విడుదల చేశారు మేకర్స్. లారెన్స్ కొత్త లుక్ లో కనిపించారు. యాక్షన్ సీక్వెన్స్ ను అద్భుతంగా కొరియోగ్రఫీ చేశారు. జి.వి. ప్రకాష్ కుమార్ నేపధ్య సంగీతం యాక్షన్ ని మరింతగా ఎలివేట్ చేసింది. ఈ గ్లింప్స్ యాక్షన్ ని ఇష్టపడే వారిని ఆకట్టుకుంటుంది.
ఫైవ్ స్టార్ క్రియేషన్స్ ఎల్ఎల్పి ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, కతిరేశన్ సమర్పిస్తున్నారు.
ఈ చిత్రంలో శరత్ కుమార్ కీలక పాత్రలో నటిస్తుండగా ప్రియాభవానీ శంకర్ కథానాయికగా నటిస్తోంది. ఈ చిత్రానికి ఆర్ డి రాజశేఖర్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఆంథోనీ ఎడిటర్ గా, శివ-విక్కీ స్టంట్స్ అందిస్తున్నారు.