Sunday - April 2, 2023
Sunday - April 2, 2023

For advertising email us: [email protected]

‘Of the cinema, by the cinema, for the cinema’ is our motto.
We are the all-in-one destination for the cine maniacs.

హను-మాన్ విజువల్ వండర్ గా వుంటుంది: టీజర్ లాంచ్ ఈవెంట్ లో చిత్ర యూనిట్

Written by:

క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఒరిజినల్ ఇండియన్ సూపర్ హీరో సినిమాలను రూపొందించడానికి ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్‌ ని సృష్టించారు. తేజ సజ్జా నటిస్తున్న హను-మాన్… మల్టీవర్స్ నుండి వస్తున్న తొలి చిత్రం. సోమవారం చిత్రబృందం ఊహాతీతమైన టీజర్ తో వచ్చారు.

 

ఒక అద్భుతమైన జలపాతాన్ని చూపిస్తూ టీజర్ ప్రారంభమైయింది. జలపాతంకు ఆనుకొని చేతిలో గదతో భారీ హనుమాన్ విగ్రహం కూడా దర్శనమిస్తోంది. నేపథ్యంలో శ్రీరామ నామం వినిపించింది.

 

టీజర్ లో కొన్ని జీవురాశులు కొండపై ఒక కాంతిపుంజం చుట్టూ ప్రదక్షణం చేయడం ‘సుప్రీమ్ బీయింగ్’ రాకను సూచిస్తుంది. సముద్రం ఒడ్డున అపస్మారక స్థితిలో వున్నట్లుగా తేజ సజ్జా ఎంట్రీ ఇచ్చాడ. అమృత అయ్యర్ భయపడుతూ చూడటం సూర్యగ్రహణం చెడు యొక్క ఆగమనాన్ని సూచిస్తుంది. వినయ్ రాయ్ ‘మ్యాన్ ఆఫ్ డూమ్’ గా భయపెట్టారు. వరలక్ష్మి శరత్‌కుమార్ కొబ్బరిగెలతో విలన్స్ ని  కొట్టే పెళ్లికూతురుగా ఎంట్రీ ఇచ్చారు.

 

హనుమంతు అండర్‌ డాగ్‌ నుంచి సూపర్‌హీరోగా మారడం విజువల్ వండర్ గా వుంది. ప్రశాంత్ వర్మ, అతని టీం 121 సెకన్ల టీజర్ విజువల్ వండర్ గా అంజనాద్రి ప్రపంచంలోకి తీసుకెళ్లింది. వీ ఎఫ్ ఎక్స్ వర్క్ మంచి క్వాలిటీతో ఉన్నాయి.

 

టీజర్ లాంచ్ కార్యక్రమంలో దర్శకుడు ప్రశాంత్ వర్మ మాట్లాడుతూ, “నాకు చిన్నప్పటినుండి చాలా ఇష్టమైన దేవుడు హనుమంతుడు. ఆయన పేరు మీద ఇంత పెద్ద సినిమా చేయడం ఆనందంగా వుంది. ఇంత పెద్ద సినిమా చేయడానికి ముందుకు వచ్చిన మా నిర్మాతలు  నిరంజన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు. మొదట అనుకున్న బడ్జెట్ కంటే ఆరింతలు పెద్దదయ్యింది. ఆయన ఎక్కడా రాజీపడకుండా ఈ సినిమాని ఇంటర్నేషనల్ ఫిల్మ్ గా చేయమని సపోర్ట్ చేశారు. హను మాన్ కేవలం పాన్ ఇండియా సినిమా కాదు పాన్ వరల్డ్ సినిమా. ఎందుకంటే హనుమంతుడు సూపర్ హీరో. బ్యాట్ మాన్ సూపర్ మాన్ కంటే పవర్ ఫుల్ ఎవరంటే హను మాన్ పేరు చెబుతాం. నాకు చిన్నప్పటి నుండి పౌరాణికాలు చాలా ఇష్టం. నా ప్రతి సినిమాలో ఎదో ఒక రిఫరెన్స్ వుంటుంది. మొదటి సారి పూర్తి స్థాయి పౌరాణిక పాత్ర అయిన హను మాన్ మీద సినిమా చేస్తున్నాం. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్‌ అని చాలా పాత్రలతో ఒక యూనివర్ష్ క్రియేట్ చేస్తున్నాం. ఇప్పటికే అధీర అనే ఒక సినిమా ప్రకటించాం. ఇవన్నీ మన పురాణాల నుండి స్ఫూర్తి పొందిన పాత్రల ద్వారా రూపొందే చిత్రాలు. హను మాన్ టీజర్ కంటే ట్రైలర్ బావుంటుంది. ట్రైలర్ కంటే సినిమా ఇంకా బావుంటుంది. తేజ సజ్జాతో కలసి జాంబీ రెడ్డి చేశాం. హను మాన్ కి తేజనే ఎందుకు తీసుకున్నామని చాలా మంది అడిగారు. ఈ పాత్ర కోసం ఒక అండర్‌ డాగ్‌ కావాలి. చిన్నప్పటి నుండి తేజ చేసిన పాత్రలు కారణంగా అందరికీ తేజ అంటే పాజిటివ్ ఫీలింగ్ వుంటుంది. అతను చేస్తే బావుంటుందని అందరూ కోరుకుంటారు. తేజకి ఆ ఛార్మ్ వుంది. బడ్జెట్, మార్కెట్ ఏమీ అలోచించకుండా ఈ సినిమా చేశాం. ఈ సినిమాలో పని చేసిన అమృత అయ్యర్, వరలక్ష్మి శరత్‌కుమార్, వినయ్ రాయ్, గెటప్ శ్రీను, సత్య, రాజ్ దీపక్ శెట్టి… అందరికీ థాంక్స్. ఇందులో గెటప్ శ్రీను, వెన్నెల కిషోర్ విలక్షణమైన గెటప్స్ లో కనిపిస్తారు. ఈ సినిమా కోసం అంజనాద్రి అనే కొత్త వరల్డ్ క్రియేట్ చేశాం. ఇక్కడి జరిగే కథ. విజువల్ వండర్ గా వుంటుంది. మన సినిమా ఆర్ఆర్ఆర్, కార్తికేయ 2 పాన్ ఇండియా, పాన్ వరల్డ్ వెళుతున్నాయి. హను మాన్ కూడా అన్ని భాషల ప్రేక్షకులని ఆకట్టుకునే సినిమాగా చేశామని నమ్ముతున్నాం. తమిళ్, హిందీ, మలయాళం, కన్నడ ప్రేక్షకులు కూడా ఇది తమ సినిమా అని భావించేలా రూపొందించాం. హను మాన్ పాన్ వరల్డ్ ఫిల్మ్. నిజంగా చాలా గొప్ప సినిమా చేశాం” అన్నారు

Social Share

Related Posts

Galleries