Saturday - April 20, 2024
Saturday - April 20, 2024
For advertising email us: [email protected]

‘Of the cinema, by the cinema, for the cinema’ is our motto.
We are the all-in-one destination for cine maniacs.

లైక్ షేర్ అండ్ సబ్‌స్క్రైబ్ ట్రైలర్‌ను లాంచ్ చేసిన ప్రభాస్

Written by:

సంతోష్ శోభన్, దర్శకుడు మేర్లపాక గాంధీల లవ్ అండ్ క్రైమ్ ఎంటర్‌టైనర్ లైక్ షేర్ అండ్ సబ్‌స్క్రైబ్ నవంబర్ 4న విడుదలకు సిద్ధంగా ఉంది. ఇప్పటికే సినిమాకు సంబంధించిన ప్రమోష‌న్స్ జోరుగా సాగుతున్నాయి. ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను రెబల్ స్టార్ ప్రభాస్ లాంచ్ చేశారు.

 

దర్శకుడు మేర్లపాక గాంధీ కాన్ ఫ్లిక్ట్ ని రివిల్ చేయకుండానే చాలా చాకచక్యంగా క్యూరియాసిటీని పెంచుతూ ట్రైలర్‌ను కట్‌ చేశాడు.

 

ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో సంతోష్ శోభన్ మాట్లాడుతూ, “మా సినిమా ట్రైలర్ రిలీజ్ చేసిన ప్రభాస్ గారికి  లైక్ షేర్ అండ్ సబ్‌స్క్రైబ్ టీం తరపున కృతజ్ఞతలు. చాలా ఎంజాయ్ చేస్తూ ఈ సినిమా చేశాం.  లైక్ షేర్ అండ్ సబ్‌స్క్రైబ్  కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్. అందరూ చూసి ఎంజాయ్ చేయొచ్చు. మేర్లపాక గాంధీ గారు ఇచ్చిన కథతో ఎక్ మినీ కథ చేశాను. అది మంచి విజయం సాధించింది. నటుడిగా మంచి గుర్తింపు తెచ్చింది. ఇప్పుడు ఆయన దర్శకత్వం నటించడం ఆనందంగా వుంది. మా నిర్మాత వెంకట్ బోయినపల్లి గారికి కృతజ్ఞతలు. ఫరియా అబ్దుల్లా ని ఈ సినిమాలో చూసి అందరూ ఆశ్చర్య పోతారు. బ్రహ్మజీ గారి పాత్ర ఇందులో అవుట్ స్టాండింగ్ గా వుంటుంది. నవంబర్ 4న సినిమా విడుదలౌతుంది. అందరూ తప్పకుండా  థియేటర్లో చూసి ఎంజాయ్ చేయాలి” అని కోరారు.

 

వసంత్ డీవోపీ గా పని చేస్తున్న ఈ చిత్రానికి  ప్రవీణ్ లక్కరాజు, రామ్ మిరియాల సంగీతం అందించారు. నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్‌తో కలిసి ఆముక్త క్రియేషన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్.

https://youtu.be/Yi3yBF_Erng

 

Social Share

Related Posts

Galleries