Thursday - April 25, 2024
Thursday - April 25, 2024
For advertising email us: [email protected]

‘Of the cinema, by the cinema, for the cinema’ is our motto.
We are the all-in-one destination for cine maniacs.

వాల్తేర్ వీరయ్య సెట్ లో బాస్ పార్టీ సాంగ్ వీక్షించిన పవన్ కళ్యాణ్

Written by:

వాల్తేర్ వీరయ్య – చిరంజీవి టైటిల్ పాత్రలో, బాబీ కొల్లి (కెఎస్ రవీంద్ర) దర్శకత్వం వహిస్తున్న చిత్రం. ఈ చిత్రం సెట్ కి పవన్ కళ్యాణ్ తన హరిహర వీరమల్లు చిత్ర దర్శకుడు క్రిష్, నిర్మాత ఏఎమ్ రత్నంతో కలిసి సందర్శించారు. బాస్ పార్టీ పాటను చూసి ఆనందించారు పవన్. బాబీ కొల్లి ఈ మెగా మూమెంట్ పై గొప్ప సంతోషాన్ని వ్యక్తం చేశారు.

 

“ఇది ఎప్పటికీ గుర్తుపెట్టుకునే  గొప్ప క్షణం. నా మోస్ట్ ఫేవరెట్ పర్సన్స్ మెగాస్టార్ చిరంజీవి గారు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి పక్కనే వున్నాను. కళ్యాణ్ గారు బాస్ పార్టీ  పాటను చూశారు. కళ్యాణ్ గారికి చాలా నచ్చింది. ఆయన గొప్ప పాజిటివ్ పర్సన్. ఎన్నేళ్ళు గడిచినా అదే ప్రేమ వాత్సల్యం” అని  ట్వీట్ చేశారు బాబీ.

 

ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ షూటింగ్ స్పాట్‌ కి వెళ్లి పాటను చూస్తున్న ఫోటోలని షేర్ చేశారు దర్శకుడు బాబీ.

 

బాస్ పార్టీలో చిరంజీవి సరసన ఊర్వశి రౌతేలా సందడి చేయబోతుంది.

 

ఈ సినిమాలో రవితేజ ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. అన్ని కమర్షియల్ హంగులతో కూడిన మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో చిరంజీవి సరసన శృతి హాసన్ కథానాయికగా నటిస్తోంది.

 

వాల్తేరు వీరయ్య 2023 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది.

Social Share

Related Posts

Galleries