వినోదంతో కూడిన వైవిధ్యమైన చిత్రాలు రూపొందిస్తూ, విలక్షణమైన కథాంశాలని ఎంచుకుంటూ తనకంటూ ఒక మార్క్ ని సంపాదించుకున్న దర్శకుడు మేర్లపాక గాంధీ. తన సినిమాలన్నింటిలో వినోదం ప్రధానంగా ఉండేలా చూసుకున్నారు. ప్రస్తుతం మేర్లపాక గాంధీ, ప్రామిసింగ్ హీరో సంతోష్ శోభన్ తో లైక్ షేర్ అండ్ సబ్ స్క్రైబ్ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. యూనిక్ కాన్సెప్ట్ తో రూపొందుతున్న లవ్ అండ్ ఎంటర్ టైనర్ లో సంతోష్ శోభన్ జోడిగా జాతి రత్నాలు ఫేమ్ ఫరియా అబ్దుల్లా కథానాయికగా నటిస్తోంది. బ్లాక్ బస్టర్ హిట్ ‘శ్యామ్ సింగరాయ్’ ని అందించిన వెంకట్ బోయనపల్లికి చెందిన నిహారిక ఎంటర్టైన్మెంట్స్తో కలిసి ఆముక్త క్రియేషన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఇటివలే విదుదలైన ఈ సినిమా ఫస్ట్‌లుక్ పోస్టర్, టైటిల్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. హీరో, హీరోయిన్ లుక్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. తాజాగా ఈ చిత్రం నుండి నెల్లూరు సుదర్శన్ ఫస్ట్ లుక్ విడుదలైయింది. బాలీవుడ్ సినిమాటోగ్రఫర్ జాక్ డేనియల్స్ గా సుదర్శన్ ఫస్ట్ లుక్ హిలేరియస్ గా వుంది. సినిమా నుండి రివిల్ చేస్తున్న మెటీరియల్ సినిమాపై చాలా క్యూరియాసిటీని పెంచుతున్నాయి.