Friday - March 29, 2024
Friday - March 29, 2024
For advertising email us: [email protected]

‘Of the cinema, by the cinema, for the cinema’ is our motto.
We are the all-in-one destination for cine maniacs.

NC22 ప్రధాన సాంకేతిక విభాగం, క్రియేటివ్ టీమ్ ని ప్రకటించిన మేకర్స్

Written by:

అక్కినేని నాగ చైతన్య తన కొత్త ప్రాజెక్ట్‌ను ప్రారంభించారు. ఈ చిత్రానికి  NC22 అని వర్కింగ్ టైటిల్ పెట్టారు. NC22 చైతన్య తొలి  తెలుగు-తమిళ ద్విభాషా చిత్రం.  క్రియేటివ్  డైరెక్టర్ వెంకట్ ప్రభు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో నాగ చైతన్యకు జోడీగా కృతి శెట్టి నటిస్తోంది.

 

శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి దిగ్గజ సంగీత దర్శకులైన తండ్రీ కొడుకులు ఇసైజ్ఞాని ఇళయరాజా, యువన్ శంకర్ రాజా సంగీతం అందించడం మరో విశేషం. వారిద్దరూ కలసి చేస్తున్న మొదటి సినిమా కావడంతో ఈ కాంబినేషన్‌లో చార్ట్‌బస్టర్ ఆల్బమ్ ఖాయమని చెప్పాలి.

 

ఈ సినిమా చిత్రీకరణ సెప్టెంబర్ 21, 2022న ప్రారంభమవుతుందని మేకర్స్ ఇటీవల ప్రకటించారు. ముందుగా చెప్పినట్లే హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో భారీగా వేసిన సెట్‌లలో షూటింగ్ ప్రారంభమైంది.

ఈ చిత్రంలో చాలా మంది ప్రముఖ నటీనటులు, ప్రముఖ సాంకేతిక నిపుణులు పని చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. సినిమాటోగ్రాఫర్ ఎస్ఆర్ కతీర్ ఈ ప్రాజెక్ట్ లోకి వచ్చారు. స్టార్ డైలాగ్ రైటర్ అబ్బూరి రవి డైలాగ్స్ రాయగా, వెంకట్ రాజన్ ఎడిటింగ్ అందిస్తున్నారు. ప్రొడక్షన్ డిజైన్ కోసం రాజీవన్‌ని ఎంపిక చేశారు. ఇంటర్నేషనల్ యాక్షన్ డైరెక్టర్ యాన్నిక్ బెన్ తో పాటు మహేష్ మాథ్యూ కూడా యాక్షన్ ఎపిసోడ్స్ ని డిజైన్ చేస్తున్నారు.

Social Share

Related Posts

Galleries