Tuesday - November 28, 2023
Tuesday - November 28, 2023
For advertising email us: [email protected]

‘Of the cinema, by the cinema, for the cinema’ is our motto.
We are the all-in-one destination for cine maniacs.

మీట్ క్యూట్ ప్లెజంట్ వెబ్ సిరీస్ గా ఆకట్టుకుంటుంది: నాచురల్ స్టార్ నాని

Written by:

నాని సోదరి దీప్తి గంటా దర్శకత్వం వహించిన తొలి వెబ్ సిసిరీస్ మీట్ క్యూట్. వాల్ పోస్టర్ సినిమా పతాకంపై నాని ఈ సిరీస్ ను
నిర్మించారు. ఐదు కథల ఆంథాలజీగా ఆమె తెరకెక్కించిన ఇందులో వర్ష బొల్లమ్మ, శ్రీదివ్య, సమీర్, అశ్విన్ కుమార్, సత్యరాజ్, రుహానీ, రాజ్ చెంబోలు, రోహిణి మొల్లేటి, ఆకాంక్షా సింగ్, దీక్షిత్ శెట్టి అలేఖ్య హారిక, ఆదా శర్మ, శివ కందుకూరి, సునైన తదితరులు కీలకపాత్రల్లో నటించారు. ఈ నెల 25న సోని లివ్ లో మీట్ క్యూట్ ఎక్స్ క్లూజివ్ ప్రీమియర్ కు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా దీప్తి, నాని తాజా ఇంటర్వ్వూలో మీట్ క్యూట్ విశేషాలు తెలిపారు.

 

దర్శకురాలు దీప్తి గంటా మాట్లాడుతూ, “నేను గతంలో ఒక షార్ట్ ఫిలిం చేశాను. మీట్ క్యూట్ లో ఒక కథ రాసినప్పుడు నానికి వినిపిస్తే ఇలాంటివి ఇంకో మూడు నాలుగు రాయి కలిపి ఆంథాలజీ చేయొచ్చు అని సలహా ఇచ్చాడు. నాని అడిగినా కూడా ఏదైనా మంచి ఆలోచన ఇన్స్పైర్ చేశాకే స్క్రిప్ట్ రాశాను. ప్రయాణాల్లో, ఇతర సందర్భాల్లో ఎవరైనా తెలియని వారితో పరిచయం చేసుకుని మాట్లాడటం నాకు అలవాటు. అలాంటి అపరిచిత వ్యక్తుల మధ్య సంభాషణ ఎలా ఉంటుంది అనే ఊహతో ఈ స్క్రిప్ట్ మొదలుపెట్టాను. మన లైఫ్ లో ఎదురయ్యే ప్లెజంట్ మూమెంట్స్ తో పాటు వివిధ సందర్భాలను ఈ కథల్లో చూపిస్తాం. సత్యరాజ్, అశ్విన్, ఆదా శర్మ ఇలాంటి మంచి ఆర్టిస్టులు నా కథలోకి రావడం సంతోషాన్నిచ్చింది. అర్బన్ బేబేస్డ్ గా ఈ కథ సాగుతుంది. అయినా ప్రేక్షకులందరికీ కనెక్ట్ అయ్యేలా ఉంటుంది. ఓ మంచి లవ్ స్టోరి రాస్తే ఆ కథను నాని హీరోగా తెరకెక్కిస్తా. ఇకపైనా మంచి ఫీల్ గుడ్ స్క్రిప్ట్ రాసి డైరెక్ట్ చేస్తాను” అని అన్నారు.

 

నాని మాట్లాడుతూ, “ఫస్ట్ ఈ స్క్రిప్ట్ చాలా రోజులు చదవకుండా పక్కనపెట్టాను. చదివిన వారంతా బాగుంది అని చెప్పినా అలాగే చెప్తారు అనుకున్నా. మా సిస్టర్ ప్రెజర్ చేసే సరికి చదవడం ప్రారంభించాను. కొద్ది పేజీలు చదివేసరికి ఆ కథలో లీనమయ్యాను. అంత ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. మీట్ క్యూట్ అనే స్క్రిప్ట్ మా సిస్టర్ కాకుండా మరెవరు రాసినా ప్రొడ్యూస్ చేసేందుకు ముందుకొచ్చేవాడిని. నాకు స్క్రిప్ట్ ఇచ్చేవారు పోన్ నెంబర్ రారాసి వెళ్తారు. అలా రాయకున్నా వాళ్లెవరో వెతికి మరీ ఈ కథను తెరకెక్కించేవాళ్లం. మీట్ క్యూట్ లో క్యారెక్టర్స్, అవి మాట్లాడుకునే మాటలు, వాళ్ల మధ్య వచ్చే సందర్భాలు అన్నీ చాలా సహజంగా ఉంటాయి. ఈ కథ సినిమాకు ఉపయోగపడదు. ఎందుకంటే మనం సినిమాల్లో ఎంత నాచురల్ స్టోరీ తీసుకున్నా దానికి కొంత డ్రామా కలుపుతాం. ఆ సినిమాటిక్ లిబర్టీ తీసుకుంటాం. కానీ ఇందులో ఆ పాత్రలు తర్వాత ఎలా ముందుకెళ్తాయి, ఎలా ముగుస్తాయి అనే ఆసక్తి కలుగుతుంటుంది. నాకు ఇందులో నటించే క్యారెక్టర్ లేదు. సిస్టర్ డైరెక్టర్ కాబట్టి నేను ఖచ్చితంగా అతిథి పాత్రలో నటిస్తానని అంతా ఎక్స్ పెక్ట్ చేస్తారు. కానీ కథలో అవకాశం లేకుండా నటిస్తే పేరుకు కనిపించినట్లు ఉంటుంది. ఆంథాలజీ అంటే ఒక్కో కథను ఒక్కొక్కరు డైరెక్ట్ చేస్తారు. కానీ ఈ కథను తను ఒక్కరే తెరకెక్కించారు. ఈ సిరీస్ అంతా ప్లెజంట్, ఏదో ఒక మంచి విషయాన్ని, మంచి మాటను ఇది చూశాక నేర్చుకుంటాం. రోహిణి, ఆకాంక్ష మధ్య వచ్చే సన్నివేశాలు నాకు బాగా నచ్చాయి. మంచి కంటెంట్ నా దగ్గరకు వచ్చినప్పుడు వాల్ పోస్టర్ సంస్థ ద్వారా నిర్మిస్తాం” అని అన్నారు.

Social Share

Related Posts

Galleries