నందమూరి కళ్యాణ్ రామ్ డెబ్యూ డైరెక్టర్ రాజేందర్ రెడ్డితో నెక్ట్స్ మూవీ చేస్తున్నారు. నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోన్న NKR19 చిత్రానికి మేకర్స్ అమిగోస్ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ మూవీని ఫిబ్రవరి 10, 2023న గ్రాండ్ లెవల్లో విడుదల చేస్తున్నారు. ఫైనల్ షెడ్యూల్ చిత్రీకరణతో పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులతో చిత్ర యూనిట్ బిజీగా ఉంది. ఈ సినిమాలో కళ్యాణ్ రామ్‌కు జోడీగా ఆషికా రంగనాథ్ నటిస్తుంది. గిబ్రాన్ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రానికి ఎస్.సౌందర్ రాజన్ సినిమాటోగ్రాఫర్‌గా, తమ్మిరాజు ఎడిటర్‌గా వర్క్ చేస్తున్నారు
