Tuesday - April 23, 2024
Tuesday - April 23, 2024
For advertising email us: [email protected]

‘Of the cinema, by the cinema, for the cinema’ is our motto.
We are the all-in-one destination for cine maniacs.

కృష్ణ వ్రింద విహారి ఫ్యామిలీ, మాస్, క్లాస్ అందరినీ అలరిస్తుంది: నాగశౌర్య

Written by:

నాగశౌర్య కథానాయకుడిగా అనీష్‌ ఆర్‌ కృష్ణ దర్శకత్వంలో ఐరా క్రియేషన్స్‌ పతాకంపై ప్రముఖ నిర్మాత ఉషా మూల్పూరి నిర్మించిన చిత్రం కృష్ణ వ్రింద విహారి. ఈ చిత్రంతో షిర్లీ సెటియా టాలీవుడ్‌లోకి అడుగుపెడుతోంది. శంకర్ ప్రసాద్ ముల్పూరి ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. మహతి స్వరసాగర్ సంగీతం అందించారు. సెప్టెంబర్ 23న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదలౌతున్న నేపధ్యంలో హీరో నాగశౌర్య విలేఖరుల సమావేశంలో చిత్ర విశేషాలని పంచుకున్నారు.

కృష్ణ వ్రింద విహారి కథ ఎప్పుడు విన్నారు?
కృష్ణ వ్రింద విహారి కథ 2020 కోవిడ్ ఇంకా మొదలవ్వకముందే విన్నాను. కథ వినగానే నచ్చేసింది. వెంటనే సినిమాని చేస్తానని దర్శకుడితో చెప్పా. మంచి ఫన్, ఎంటర్ టైమెంట్, ఫ్యామిలీ, మాస్..ఇలా అందరికీ కావాల్సిన ఎలిమెంట్స్ వున్నాయి. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ తమ ఫ్యామిలీతో రిలేట్ చేసుకుంటారు. కృష్ణ వ్రింద విహారి ఎవర్ గ్రీన్ కథ. కుటుంబం ఉన్నంత వరకూ ఇలాంటి కథలకు తిరుగులేదు.

పాదయాత్ర అనుభవం ఎలా వుంది? ఆరోగ్యంపై ప్రభావం పడిందా?
ఆరోగ్యం కొంచెం తేడా కొట్టింది. అయితే అది పాదయాత్ర కంటే సినిమా రిలీజ్ ఒత్తిడి వలన అని భావిస్తాను. నా కెరీర్ లో ఇంత టెన్షన్ ఎప్పుడూ పడలేదు. పాదయాత్రలో ప్రేక్షకుల అభిమానం చూస్తే నిజంగా ఒక వరం అనిపించింది. పాదయాత్రలో చాలా నేర్చుకున్నాను.

బ్రాహ్మణ పాత్రలతో అదుర్స్, డిజే, ఇటివల అంటే సుందరానికీ వచ్చాయి కదా. ఇందులో ఎలా వుండబోతుంది?
అదుర్స్ , డిజే,  అంటే సుందరానికీ.. ఇలా ఎన్నో సినిమాల్లో  బ్రాహ్మణ పాత్ర ఉన్నంత మాత్రాన పాత్రలు, కథలు ఒకటి కాదు. దేనికదే భిన్నమైనది. కృష్ణ వ్రింద విహారి కూడా భిన్నమైన కథ.

ఇందులో పాత్రల వినోదం  ఎలా వుంటుంది?
ఇందులో వున్న అన్ని పాత్రల్లో వినోదం వుంటుంది. రాధిక గారి పాత్ర తప్పితే మిగతా పాత్రలన్నీ హిలేరియస్ గా వుంటాయి. అనీష్ మంచి కామెడీ టైమింగ్ వున్న దర్శకుడు. ఇందులో సెకండ్ హాఫ్ నాకు చాలా నచ్చింది. అలాగే రాధిక గారు పాత్ర ఇందులో చాలా కీలకం. రాధిక గారితో నటించడం గొప్ప అనుభవం. రాధిక గారు  బిజీగా వుండి ప్రమోషన్స్ కి రాలేకపోయారు. సక్సెస్ మీట్ కి వస్తారని భావిస్తున్నాను.

రొమాంటిక్ కామెడీలని సౌకర్యంగా భావిస్తారా?
నిజంగా రొమాంటిక్ కామెడీలు చేసినప్పుడు అంత సౌకర్యంగా ఫీలవ్వను. రొమాంటిక్ సీన్స్ లో నేను చాలా వీక్(నవ్వుతూ). నందిని రెడ్డిగారిని అడిగినా ఇదే చెప్తారు. మా దర్శకుడు చాలా కష్టపడి జాగ్రత్తగా ఇందులో చేయించారు.

ఈ పాత్ర కోసం ప్రత్యేకంగా ప్రీపేర్ అయ్యారా?
కమల్ హాసన్ , ఎన్టీఆర్, అల్లు అర్జున్ ఇలా చాలా పెద్ద స్టార్లు బ్రహ్మణ పాత్రలలో అద్భుతంగా నటించారు. ఈ పాత్ర చేస్తున్నపుడు చాలా జాగ్రత్తలు తీసుకున్నాను. నాకు బాగా తెలిసిన అవసరాల శ్రీనివాస్ బ్రహ్మిన్ కావడం వలన ఆయనకి తెలియకుండానే  ఆయన దగ్గర నుండి కొన్ని చేర్చుకున్నాను.

మాస్ సినిమాలు చేయాలనే ఆసక్తి ఎక్కువగా ఉందా?
ఒక నటుడిగా అన్ని రకాల సినిమాలు చేయాలి, అన్ని జోనర్స్ లో ప్రతిభని నిరూపించుకోవాలని వుంటుంది. క్లాస్ సినిమాలు విజయాలు ఇచ్చాయనే వాటికే పరిమితం కాకూడదు కదా. మాస్ సినిమాలు కూడా ప్రయత్నిస్తాను.

కొత్తగా చేయబోతున్న సినిమాలు?
ఫలానా అమ్మాయి ఫలానా అబ్బాయి షూటింగ్ పూర్తయ్యింది. విడుదల గురించి త్వరలోనే చెబుతా.

Social Share

Related Posts

Galleries