ఇళయరాజా సంగీత సారధ్యం వహించిన సినిమా మ్యూజిక్ స్కూల్. బుడాపెస్ట్ లో నేపథ్య సంగీతానికి తుది ముస్తాబులు చేశారు. అక్కడి ఆర్కెస్ట్రాతో నిన్న రికార్డింగ్ పూర్తి చేశారు. ఈ చిత్రంలో మొత్తం 11 పాటలున్నాయి. మ్యూజిక్ స్కూల్ ని పాపారావు బియ్యాల రాసి, దర్శకత్వం వహించారు. ఆస్కార్ అందుకున్న ది సౌండ్ ఆఫ్ మ్యూజిక్‌లో మూడు పాటలు చేశారు. ఈ సినిమాను హైదరాబాద్‌కు చెందిన యామినీ ఫిల్మ్స్ నిర్మిస్తోంది.