Monday - May 27, 2024
Monday - May 27, 2024
For advertising email us: [email protected]

‘Of the cinema, by the cinema, for the cinema’ is our motto.
We are the all-in-one destination for cine maniacs.

ఆకట్టుకుంటోన్న మంత్ ఆఫ్ మ‌ధు టీజర్

Written by:

యాక్ట‌ర్ న‌వీన్ చంద్ర‌ లేటెస్ట్ మూవీ మంత్ ఆఫ్ మ‌ధు. శ్రీకాంత్ నాగోటి దర్శ‌క‌త్వంలో క్రిష్వి ప్రొడ‌క్ష‌న్స్‌, హ్యండ్ పిక్డ్ స్టోరీస్ బ్యాన‌ర్స్‌పై య‌శ్వంత్ ములుకుట్ల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గురువారం మూవీ నిర్మాతలు ఈ సినిమా టీజర్‌ను విడుదల చేయగా, ప్రేక్షకుల నుంచి టీజర్‌కు అమేజింగ్ రెస్పాన్స్ వస్తుంది.

 

టీజర్‌లో బ్యూటీఫుల్ విజువ‌ల్స్‌తో సినిమా క‌థేంటో చెప్పే ప్ర‌య‌త్నం చేశారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. సింక్ సౌండ్ ఎఫెక్ట్‌తో రియ‌లిస్టిక్‌, నేచుర‌ల్‌గా ఉంది. హీరో హీరోయిన్స్ న‌ట‌నతో మెప్పించారు.

 

మాన‌వ సంబంధాలు.. ఓ విష‌యాన్ని జనం ఏ కోణంలో చూస్తున్నార‌నే దానిపైనే మంత్ ఆఫ్ మ‌ధు చిత్రాన్ని తెర‌కెక్కించిన‌ట్లు టీజ‌ర్‌ను చూస్తే అర్థ‌మ‌వుతుంది. క‌ల‌ర్స్ స్వాతి ఇందులో గృహిణి పాత్ర‌లో న‌టించింది. విప‌రీత‌మైన భావోద్వేగాలున్న తాగుబోతు భ‌ర్త పాత్ర‌లో న‌వీన్ చంద్ర యాక్ట్ చేశారు. వైజాగ్ ప‌రిస‌ర ప్రాంతాల్లో లైవ్ లోకేష‌న్స్‌లో సినిమాను రూపొందించారు.

 

శ్రేయా న‌వేలీ, హ‌ర్ష చెముడు కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. ఈ చిత్రానికి అచ్చు రాజ‌మ‌ణి సంగీతాన్ని అందించారు.

Social Share

Related Posts

Galleries