Wednesday - April 17, 2024
Wednesday - April 17, 2024
For advertising email us: [email protected]

‘Of the cinema, by the cinema, for the cinema’ is our motto.
We are the all-in-one destination for cine maniacs.

లైక్ షేర్ అండ్ సబ్‌స్క్రైబ్ ఆద్యంతం ఒక ఫన్ రైడ్ లా వుంటుంది: దర్శకుడు మేర్లపాక గాంధీ

Written by:

హీరో సంతోష్ శోభన్, దర్శకుడు మేర్లపాక గాంధీల తాజా చిత్రం లైక్ షేర్ అండ్ సబ్‌స్క్రైబ్. జాతిరత్నాలు ఫేమ్ ఫరియా అబ్దుల్లా కథానాయికగా నటిస్తోంది. నవంబర్ 4న సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తున్న నేపధ్యంలో దర్శకుడు మేర్లపాక గాంధీ విలేఖరుల సమావేశంలో చిత్ర విశేషాలని పంచుకున్నారు.

లైక్ షేర్ అండ్ సబ్‌స్క్రైబ్ స్టోరి ఐడియా ఎప్పుడు వచ్చింది?

లాక్ డౌన్ సమయంలో అందరికీ తీరిక దొరికింది. అప్పుడే చాలా మంది యూట్యూబ్ కంటెంట్ కి అలవాటు పడ్డారు. ఆ సమయంలో ఎలాగూ బయటికి వెళ్ళలేం కాబట్టి కనీసం ట్రావెల్ వీడియోస్ చూస్తే బయటికి వెళ్ళిన ఫీలింగ్ వుంటుందని ఎక్కువగా ట్రావెల్ వ్లాగ్ వీడియోస్ చూశాను. అది చాలా నచ్చింది. ప్రదేశాలు గురించి, వాటి చరిత్ర గురించి చెప్పడం చాలా ఆసక్తి గా అనిపించింది. ఒక యూట్యుబర్ కథ చేస్తే బావుంటుందనే ఆలోచన మొదలైయింది. ట్రావెల్ వ్లాగర్  కి వున్న కష్టాలు, ప్రమాదాలు, సవాళ్ళు బ్యాక్ డ్రాప్ లో సినిమాని ప్లాన్ చేశాం.

ట్రావెల్ వ్లాగ్, యూట్యుబర్ లైఫ్ తో లిమిటెడ్ ఆడియన్స్ రిలేట్ చేసుకుంటారు కదా ? కామన్ ఆడియన్స్ కి ఈ కథ ఎంత రిలేటెడ్ గా వుంటుంది?

లైక్ షేర్ అండ్ సబ్‌స్క్రైబ్ కథ చాలా హిలేరియస్ గా వుంటుంది. హీరో, హీరోయిన్  ఇద్దరూ ట్రావెల్ వ్లాగర్స్. వీరి మధ్య ఫైట్ చాలా ఆసక్తికరంగా వుంటుంది. ట్రావెల్ వీడియోలు షూట్ చేసే క్రమంలో ఎలాంటి ప్రమాదం ఎదురుకున్నారనేది కూడా చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఫస్ట్ ఫ్రేమ్ నుండి చివరి ఫ్రేమ్ వరకూ ఒక లాఫ్ రైడ్ లా వుంటుంది. అండర్ కరెంట్ గా ఒక సమస్య రన్ అవుతూనే.. ఆ పరిస్థితి నుండి వచ్చే సిట్యువేషనల్ కామెడీ అద్భుతంగా వుంటుంది.

మీ సినిమాల్లో స్క్రీన్ ప్లే స్పెషల్ ఎట్రాక్షన్ కదా. మరి ఇందులో ఎలా వుంటుంది ?

లైక్ షేర్ అండ్ సబ్‌స్క్రైబ్ స్క్రీన్ ప్లే డిఫరెంట్ గా వుంటుంది. ప్రతి పదిహేను నిమిషాలకు కథలో ఒక చేంజ్ ఓవర్, మలుపు వుంటుంది. సిట్యువేషనల్ కామెడీ ప్రధాన ఆకర్షణగా వుంటుంది.

చిన్న సినిమాలకి ప్రేక్షకులు చాలా సెలెక్టెడ్ గా థియేటర్ కి వస్తున్నారు కదా. ఆ భయం ఏమైనా ఉందా?

వుందండీ. అందుకే చాలా కొత్తగా, వైవిధ్యంగా ప్రమోట్ చేస్తున్నాం. జనాల్ని మార్నింగ్ షోకి తీసుకురావాలనేది మా టార్గెట్. మంచి టాక్ స్ప్రెడ్ అయితే, సినిమా బావుంటే ఖచ్చితంగా చూస్తారు.

కొత్తగా చేయబోతున్న సినిమాలు?

స్క్రిప్ట్ పనులు జరుగుతున్నాయి. పెద్ద సినిమా చేయాలనే మూడ్ లో వున్నా.

Social Share

Related Posts

Galleries