రాహుల్ విజయ్, మేఘ ఆకాష్ జంటగా నటిస్తున్న సినిమా మాటే మంత్రము. ఈ చిత్రాన్ని మేఘ ఆకాష్ తల్లి బిందు ఆకాష్స మర్పిస్తున్నారు. కోట ఫిలిం ఫ్యాక్టరీ అండ్ ట్రిప్పి ఫ్లిక్స్ స్టూడియోస్ బ్యానర్స్ పై ఎ సుశాంత్ రెరెడ్డి, అభిషేక్ కోట నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సుశాంత్ రెడ్డి కథను అందించగా, అభిమన్యు బద్ది దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. బుధవారం హీరోయిన్ మేఘా ఆకాష్ పుట్టినరోజు సందర్భంగా సినిమా నుంచి ఆమె ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు. రెబల్ కావ్యగా మేఘా ఆకాష్ లుక్ సరికొత్తగా ఉంది.