దర్శకుడు మేర్లపాక గాంధీ, హీరో సంతోష్ శోభన్ ల తాజా చిత్రం లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ విడుదలకు సిద్ధంగా వుంది. వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్న ఈ చిత్రంలో జాతిరత్నాలు ఫేమ్ ఫరియా అబ్దుల్లా కథానాయికగా నటిస్తోంది. దసరా సందర్భంగా, ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించారు నిర్మాతలు.
లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నవంబర్ 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. రిలీజ్ డేట్ పోస్టర్ లో సంతోష్, ఫారియా బ్రీఫ్కేస్ పై కూర్చుని లవ్లీగా కనిపించారు.