Friday - March 29, 2024
Friday - March 29, 2024
For advertising email us: [email protected]

‘Of the cinema, by the cinema, for the cinema’ is our motto.
We are the all-in-one destination for cine maniacs.

లైక్ షేర్ అండ్ సబ్‌స్క్రైబ్ ని ప్రేక్షకులు తప్పకుండా ఎంజాయ్ చేస్తారు: ఫరియా అబ్దుల్లా

Written by:

దర్శకుడు మేర్లపాక గాంధీ, హీరో సంతోష్ శోభన్ ల తాజా చిత్రం లైక్ షేర్ & సబ్‌స్క్రైబ్. ఈ చిత్రంలో సంతోష్ శోభన్ సరసన జాతిరత్నాలు ఫేమ్ ఫరియా అబ్దుల్లా కథానాయికగా నటిస్తోంది. నవంబర్ 4న సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తున్న నేపధ్యంలో హీరోయిన్ ఫరియా అబ్దుల్లా విలేఖరుల సమావేశంలో సినిమా విశేషాలని పంచుకున్నారు.

లైక్ షేర్ అండ్ సబ్‌స్క్రైబ్ కథలో మిమ్మల్ని  ఆకర్షించిన అంశాలు ఏమిటి?

లైక్ షేర్ అండ్ సబ్‌స్క్రైబ్ చాలా మంచి కథ. బిగినింగ్ నుండి ఎడింగ్ వరకూ చాలా లేయర్స్ వున్న స్క్రిప్ట్. నాకు ప్రయాణం అంటే చాలా ఇష్టం. లైక్ షేర్ అండ్ సబ్‌స్క్రైబ్ కథ ట్రావెలింగ్ నేపధ్యంలో వుంటుంది. అలాగే ఇందులో నా పాత్రలో చాలా మలుపులు, ఎత్తుపల్లాలు వుంటాయి. ఇందులో  ప్రతి పాత్రకు ఒక నేపధ్యం ఉంటూ కథలో భాగం అవుతుంది.

మీ పాత్ర ఎలా వుండబోతుంది?

ఇందులో ట్రావెల్ వ్లాగర్ గా కనిపిస్తా. వీడియోస్ కోసం దేశమంతా తిరిగే పాత్ర ఇది. ఈ ప్రయాణంలో హీరోని కలుస్తా. తను కూడా ఒక ట్రావెల్ వ్లాగర్. కథ చాలా ఎంటర్టైనింగా వుంటుంది. లైక్ షేర్ అండ్ సబ్‌స్క్రైబ్ ప్రయాణంలో మర్చిపోలేని జ్ఞాపకాలు వున్నాయి. జీవితంలో మొదటి విదేశీ ప్రయాణం ఈ సినిమా వలనే జరిగింది. థాయిలాండ్ లో ఒక పాట షూట్ చేయడం కోసం వెళ్లాను. మర్చిపోలేని జ్ఞాపకం ఇది.

దర్శకుడు మేర్లపాక గాంధీ గారితో పని చేయడం ఎలా అనిపించింది?

మేర్లపాక గాంధీ గారితో పని చేయడం డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. చాలా క్లారిటీతో డైరెక్ట్ చేస్తారు. ఆయన ఫన్ కూడా చాలా నేచురల్గా వుంటుంది. ఆయన్ని బ్లైండ్ గా ఫాలో అయిపోయా. షూటింగ్ ని చాలా ఎంజాయ్ చేశా.

ఈ సినిమాలో మీకు సవాల్ గా అనిపించిన అంశాలు ఏమిటి?

మూవీ అడ్వంచర్ యాక్షన్ కామెడీ ఎంటర్టైనర్. 40 శాతం సినిమా అడవిలో జరుగుతుంది. ఇరవై రోజులు అడవిలోనే వున్నాం. సిగ్నల్ కూడా వుండదు. ట్రైలర్ లో ఒక ఊబి కనిపిస్తుంది. దాన్ని క్రియేట్ చేశాం. అలాగే యాక్షన్, చేజింగ్ సీన్లు వున్నాయి. మొత్తం ఖత్రోన్ కే ఖిలాడీ లాంటి అనుభవం ఇచ్చింది (నవ్వుతూ).

మరో రెండేళ్ళలో ఇలా వుండాలానే టార్గెట్స్ ఏమైనా ఉన్నాయా?

రెండేళ్ళు కాదు కానీ.. మరో ఐదేళ్ళతో పాన్ వరల్డ్ వుండాలని కోరుకుంటున్నాను. ప్రస్తుతం తమిళ్ లో సుసీంధిరన్ దర్శకత్వంలో విజయ్ అంటోనీ హీరో గా ఒక సినిమా చేస్తున్న. సుసీంధిరన్ గారు ఎంతో గౌరవం చూపిస్తారు. 25 ఏళ్ళు ఇండస్ట్రీలో పక్కాగా వుంటానని వారు చెప్పడం గొప్ప సంతోషాన్ని ఇస్తుంది.

ఇకపై ఎలాంటి పాత్రలు ఎంచుకోవాలని అనుకుంటున్నారు. లిమిటేషన్లు ఏమైనా ఉన్నాయా?

లిమిటేషన్లు ఏమీ లేవు. యాక్షన్, సూపర్ నేచురల్, సైకో థ్రిల్లర్స్.. ఇలా అన్నీ పాత్రలు చేయాలని వుంది. అయితే ఏ పాత్రని చేసిన రిలేటిబుల్ గా వుండాలి.

కొత్తగా చేయబోతున్న సినిమాలు?

రవితేజ రావణాసుర, ఒక తమిళ్ మూవీ, ఒక హిందీ సిరిస్ చేస్తున్నా.

Social Share

Related Posts

Galleries