తాజాగా విడుదలైన హరి హర వీరమల్లు పవర్ గ్లాన్స్ చిత్రంపై అంచనాలను ఎన్నో రేట్లు పెంచేలా ఉంది. ఈ ప్రచార చిత్రంలో వీరమల్లుగా పవన్ కళ్యాణ్ స్క్రీన్ ప్రజెన్స్ అత్యున్నత స్థాయిలో ఉంది. మీసం తిప్పి, కదన రంగంలో అడుగుపెట్టి, మల్ల యోధులను మట్టి కరిపిస్తూ శక్తివంతమైన యోధుడు గా దర్శనమిచ్చారు పవర్ స్టార్. ఇక ఆయన తొడగొట్టే షాట్ అయితే అభిమానులకు పూనకాలు తెప్పించేలా ఉంది. ఎం.ఎం.కీరవాణి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఎప్పటిలాగే ప్రశంసనీయంగా ఉంది.
