Wednesday - April 17, 2024
Wednesday - April 17, 2024
For advertising email us: [email protected]

‘Of the cinema, by the cinema, for the cinema’ is our motto.
We are the all-in-one destination for cine maniacs.

జెట్టి సినిమాలో కొన్ని విజువల్స్ ఆశ్చర్య పరిచాయి: మలినేని గోపిచంద్

Written by:

వర్ధిన్ ప్రోడక్షన్స్ బ్యానర్‌పై వేణు మాధవ్ కే నిర్మాతగా, సుబ్రమణ్యం పిచ్చుక దర్శకత్వంలో రూపొందిన చిత్రం జెట్టి. మాన్యం కృష్ణ, నందితా శ్వేత జంటగా, శివాజీ రాజా, కన్నడ కిషోర్ తదితరులు కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమా నవంబర్ 4వ తేదీన రిలీజ్ అవుతున్నది. జెట్టి మూవీ ట్రైలర్ ని సక్సెస్పుల్ దర్శకుడు మలినేని గోపీచంద్ వీరసింహారెడ్డి సెట్స్ లో లాంఛ్
చేసారు.

 

ఈ సందర్భంగా దర్శకుడు గోపీచంద్ మలినేని మాట్లాడుతూ, “జెట్టి ట్రైలర్ లో కొన్ని విజువల్స్ నన్ను ఆశ్చర్య పరిచాయి. చాలా రియలిస్టిక్ అప్రోచ్ తో మత్య్సకారుల జీవితాలను తెరమీదకు తెచ్చిన విధానం బాగుంది.  ఈ కథలో మట్టివాసనలు తెలుస్తున్నాయి. వీరి ప్రయత్నం విజయవంతంకావాలని కోరుకుంటున్నాను. పాటలు కూడా మంచి విజయం సాధించాయి అని తెలసింది. ఈ సినిమాతో పరిచయం అవుతన్న హీరో కృష్ణకు, దర్శకుడు సుబ్రమణ్యం పిచ్చుకకు నా అభినందనలు” అన్నారు.

 

హీరో మాన్యం కృష్ణ మాట్లాడుతూ, “మా ట్రైలర్ ని లాంఛ్ చేసిన దర్శకుడు గోపీచంద్ మలినేని గారికి థ్యాంక్స్. చాలా కొత్త నేపథ్యంలో ఈ సినిమా ఉంటుంది. దూరం కరిగినా సాంగ్ మా సినిమాకు మంచి హైప్ ని తెచ్చింది. మత్య్స కారుల జీవితాలను. ఆవిష్కరించిన ఈ సినిమా లో అందమైన ప్రేమకథతో పాటు తండ్రికూతుళ్ళ మద్య బలమైన ఎమోషన్స్ ఉంటాయి. నందితశ్వేత గారితో కలసి పనిచేయడం చాలా ఆనందంగా ఉంది. దర్శకుడు సుబ్రమణ్యం పిచ్చుక ఈ కథను మలిచిన
తీరు చాలా హృద్యంగా ఉంటుంది” అన్నారు.

 

Social Share

Related Posts

Galleries