Tuesday - April 23, 2024
Tuesday - April 23, 2024
For advertising email us: [email protected]

‘Of the cinema, by the cinema, for the cinema’ is our motto.
We are the all-in-one destination for cine maniacs.

ప్రిన్స్ కి ఊహించిన దానికంటే ఎక్కువ రెస్పాన్స్ వస్తోంది: దర్శకుడు అనుదీప్ కెవి

Written by:

శివకార్తికేయన్ కథానాయకుడిగా, అనుదీప్ కెవి దర్శకత్వంలో తెలుగు, తమిళ్ భాషలలో తెరకెక్కిన ఎంటర్‌టైనర్‌ ప్రిన్స్. మారియా కథానాయిక. సునీల్ నారంగ్, డి.సురేష్ బాబు, పుస్కుర్ రామ్ మోహన్ రావు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. అక్టోబర్ 21న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన నేపధ్యంలో అనుదీప్  విలేఖరులతో ముచ్చటించారు.

ప్రిన్స్ కి ఎలాంటి రెస్పాన్స్ వస్తోంది?
అన్ని చోట్ల నుండి ట్రెమండస్ రెస్పాన్స్ వస్తోంది. ప్రేక్షకులు హిలేరియస్ గా ఎంజాయ్ చేస్తున్నారు. తమిళ్ లో కూడా మంచి రెస్పాన్స్ వస్తోంది. రెండో రోజు నుండి ఫ్యామిలీ ఆడియన్స్ కూడా పెరుగుతున్నారు. తెలుగులో మేము ఊహించిన దానికంటే ఎక్కువ రెస్పాన్స్ వస్తోంది.

సెటైరికల్ కామెడీ మీ బలం కదా. వేరే జోనర్ సినిమాలు చేసే ఆలోచన ఉందా?
నాకు బాలచందర్ గారి సినిమాలు అంటే ఇష్టం. ఆయన తరహాలో ఫీమేల్ సెంట్రిక్ సినిమాలు చేయాలని వుంది.

ప్రిన్స్ తెలుగుకి  సరిపడే కథ కదా. తమిళ్ లో చేయడానికి కారణం?
ఒక కోస్టల్ ఏరియాలో జరిగే కథ ఇది. దాని తగిన వాతావరణం క్రియేట్ చేశాం. తెలుగు వెర్షన్ మేము ఊహించినదాని కంటే గొప్ప ఆదరణ లభించింది. తెలుగు నటీనటులని తీసుకొని బైలింగ్వల్ గా చేయాలని అనుకున్నాం. అయితే చాలా మార్పులు వస్తాయి. సమయం పడుతుంది. అలాగే పెద్ద హీరోల సినిమాకి రిలీజ్ సమయం ఒక సవాల్ గా వుంటుంది.

ప్రిన్స్ కి స్ఫూర్తి ఏంటి?
ప్రస్తుత పరిస్థితులలో దేశభక్తి కంటే మానవత్వం గొప్పదనే ఆలోచననే ప్రిన్స్ కథకు స్ఫూర్తి. దీనిని వినోదాత్మకంగా చెప్పాలని అనుకున్నాం. ఇందులో వార్ సీన్ అన్ రియల్ ఇంజన్- వర్చువల్ రియాలిటీలో అనే కొత్త టెక్నాలజీలో చేశాం.

బ్రిటిష్ అమ్మాయిగా మరియాని తీసుకోవడానికి కారణం?
జెస్సికా మాత్ర కోసం చాలా వెదికాం. మారియ చాలా బాగా ఆడిషన్స్ ఇచ్చింది. ఆడిషన్స్ తర్వాత జెస్సికా పాత్రకు మరియా పర్ఫెక్ట్ అనిపించింది. భాష విషయంలో కొంచెం ఇబ్బంది వుండేది. సీన్ పేపర్ ని రెండు రోజులు ముందుగానే ఇచ్చేవాళ్ళం.

సత్యరాజ్ గారి తో పని చేయడం ఎలా అనిపించింది?
సత్యరాజ్ గారి తో పని చేయడం వండర్ ఫుల్ ఎక్స్పీరియన్స్. షూటింగ్ చివరి రోజు ఆయన్ని చాలా మిస్ అయ్యాను. తన పాత్రని చాలా అద్భుతంగా చేశారు.

జాతిరత్నాలు తర్వాత మీకే ఎక్కువ క్రేజ్ వచ్చింది. మీరే ట్రెండింగ్ లో ఎక్కువగా వుంటారు కదా? మీ సెటైర్ దీనికి కారణం అనొచ్చా?
నిజానికి సినిమాల్లో సెటైర్ రాస్తానేమో గానీ రియల్ గా సెటైర్ గా మాట్లాడను. ఆ క్రేజ్ ఎందుకొచ్చిందో  నాకూ తెలీదు. బేసిగ్గా నాకు కోపం రాదు, కామన్ గానే ఇలా వుంటాను.

దీపావళి సినిమాల పోటి ప్రిన్స్ పై ఎలాంటి ప్రభావం చూపాయి?
నాలుగు సినిమాలు వచ్చినపుడు ప్రభావం వుంటుంది. అయితే దేనికదే ప్రత్యేకం. ప్రిన్స్ హిలేరియస్ ఎంటర్టైనర్. పండక్కి సరైన సినిమా.

కామెడీ సినిమాలు చేయడానికి మీకు స్ఫూర్తి?
చార్లీ చాప్లీన్, జంధ్యాల, రాజ్ కుమార్ సంతోషి ఇలా చాలా మంది వున్నారు. ప్రేక్షకులకు వినోదంతో  మంచి ఎనర్జీ ఇవ్వాలని వుంటుంది. సాహిత్యం, ఫిలాసఫీ ఎక్కువగా చదువుతాను. ఓషో, జిడ్డు కృష్ణమూర్తి, రంగనాయకమ్మ ప్రభావం వుంటుంది.

నటనపై ఆసక్తి ఉందా?
లేదండీ. నాగ్ అశ్విన్ అడగడం వలన జాతిరత్నాల్లో కనిపించా. ఇందులో కూడా చివర్లో కనిపించాల్సి వచ్చింది. ప్రిన్స్ లో కూడా శివకార్తికేయన్ గారు అడగడం వలన తప్పలేదు. ఇకపై సినిమాల్లో కనిపించాలని లేదు. దయచేసి ఎవరూ అడగొద్దు (నవ్వుతూ).

కొత్తగా చేయబోతున్నా సినిమాలు?
కొన్ని కథలు వున్నాయి. హారిక హాసిని, మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్స్ లో సినిమాలు చేయాలి. అలాగే హీరో గా హీరో రామ్ గారికి ఒక కథ చెప్పాలి.

Social Share

Related Posts

Galleries