“ఛార్లీ చాప్లీన్ ప్రభావం నాపై ఎక్కువుంది. అలాగే రాజ్ కపూర్. అమాయకత్వం నుండి పుట్టే కామెడీ నాకు చాలా ఇష్టం. అమాయకత్వం అందరికీ కనెక్ట్ అవుతుంది. హారర్, వైలెన్స్ తప్ప.. మిగతా అన్నీ జోనర్స్ ఇష్టం. మంచి డ్రామా వున్న కథలు కూడా రాయాలని వుంది,” అని జాతి రత్నాలు దర్శకుడు కెవి అనుదీప్ వెల్లడించారు. అనుదీప్ కథ అందించిన ఫస్ట్ డే ఫస్ట్ షో సెప్టెంబర్ 2 న విడుదల కానుంది.