మంచి స్క్రిప్ట్‌లు ఎంపిక చేసుకుంటూ, విభిన్నమైన సినిమాలు రూపొందించే నిర్మాత కె.కె.రాధామోహన్. ఆది సాయికుమార్ కథానాయకుడిగా శ్రీ సత్యసాయి ఆర్ట్స్‌లో ఫణి కృష్ణ సిరికి దర్శకత్వంలో ఆయన నిర్మిస్తున్న యూత్ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ క్రేజీ ఫెలో.
తాజాగా ఈ చిత్రం ట్రైలర్ విడుదలైంది. ‘క్రేజీ ఫెలో టైటిల్ కి తగ్గట్టే ట్రైలర్ చాలా క్రేజీగా వుంది. ఫ్యామిలీ, ఫన్, రొమాన్స్, యాక్షన్ అన్ని ఎలిమెంట్స్ తో క్యూరియాసిటీని పెంచింది ట్రైలర్.
అక్టోబర్ 14న సినిమాను విడుదల చేస్తున్నట్లు ట్రైలర్ ద్వారా ప్రకటించారు నిర్మాతలు.