చియాన్ విక్రమ్ కధానాయకుడిగా, ఆర్ అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ కోబ్రా. ఆగస్ట్ 31న ప్రపంచవ్యాప్తంగా విడుదలౌతుంది. చిత్ర యూనిట్ ప్రమోషన్స్ తో పకడ్బందీగా ముందుకు వెళ్తోంది.
ప్రమోషన్లో భాగంగా విక్రమ్ మాట్లాడుతూ, “నాకు నటన మీద ఎంతపిచ్చో మీకు సినిమా మీద అంత పిచ్చి. మీ అందరి ప్రేమకి కృతజ్ఞతలు. నా సినిమా థియేటర్లోకి వచ్చి మూడేళ్ళు అయ్యింది. ఈ సినిమాతో మీ అందరినీ కలుసుకోవడం చాలా ఆనందంగా వుంది. కోబ్రా విజువల్ ట్రీట్. కోబ్రా, అపరిచితుడు లాంటి సైకలాజికల్ థ్రిల్లర్. యాక్షన్, రొమాన్స్, ఫ్యామిలీ, లవ్, ఎమోషన్స్ అన్ని ఎలిమెంట్స్ వుంటాయి,” అని అన్నారు.