Friday - March 29, 2024
Friday - March 29, 2024
For advertising email us: [email protected]

‘Of the cinema, by the cinema, for the cinema’ is our motto.
We are the all-in-one destination for cine maniacs.

ఇంద్ర, ఠాగూర్‌ స్థాయిలో విజయం అందుకున్న చిత్రం గాడ్ ఫాదర్: సక్సెస్ మీట్ లో చిరంజీవి

Written by:

చిరంజీవి, సల్మాన్ ఖాన్‌ కలసి నటించిన యాక్షన్ ఎంటర్టైనర్ గాడ్ ఫాదర్. మోహన్ రాజా దర్శకత్వం వహించారు. తమన్ సంగీతం అందించారు. ఆర్‌ బి చౌదరి, ఎన్‌ వి ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. దసరా కానుకగా ప్రపంచవ్యాప్తంగా విడుదలైన గాడ్ ఫాదర్, విజయాన్ని అందుకొని సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ నేపధ్యంలో చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ నిర్వహించింది.

 

ఈ ఈవెంట్ లో మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ..”గాడ్‌ ఫాదర్‌ కు ప్రపంచం నలుమూలల నుండి ట్రెమండస్  రెస్పాన్స్ వస్తోంది. నా జీవితంలో ఇంద్ర, ఠాగూర్‌ తర్వాత ఆ స్థాయి విజయం అంటుంటే ఆనందంగా ఉంది. ఈ రోజుల్లో కంటెంట్‌ బాగుంటే సినిమాకి వస్తారని నేనే చెప్పాను. గాడ్ ఫాదర్ తో నమ్మకం నిజమైంది. ప్రేక్షకులు చిత్రానికి బ్రహ్మరధం పడుతున్నారు. చిత్రాన్ని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ కృతజ్ఞతలు. మహిళలకు కూడా ఈ చిత్రం అమితంగా నచ్చడం ఒక శుభసూచికంగా భావిస్తున్నాను.  దర్శకుడు మోహన్ రాజా లూసిఫర్ లో లేని చాలా మ్యాజిక్స్ గాడ్ ఫాదర్ లో అద్భుతంగా చూపించారు. సత్యానంద్ గారు, మాటల రచయిత లక్ష్మీ భూపాల.. ఇలా అందరితో కలసి చక్కని టీం వర్క్ చేశాం. ఈ సినిమా కోసం చివరి నిమిషం వరకూ కష్టపడ్డాం. నా అనుభవంతో చెప్పే ప్రతి చిన్న మార్పుని దర్శకుడు మోహన్ రాజా అండ్ టీం ఎంతో గొప్పగా అర్ధం చేసుకొని  మరింత చక్కగా డిజైన్ చేశారు. ఈ సినిమాలో పనిచేసినందరూ నన్ను ప్రేమించిన వారే. నేను స్క్రీన్ పై ఎలా ఉండాలో నాకంటే వాళ్ళకే బాగా తెలుసు. వాళ్ళు చెప్పినట్లే చేశాను. అందుకే ఇంత గొప్ప ఆదరణ లభించింది. గాడ్ ఫాదర్ లో నేను కళ్ళతోనే నటించానని ప్రశంసలు వస్తున్నాయంటే .. ఈ క్రెడిట్ అంతా  సినిమాలో పని చేసినందరికీ వెళుతుంది. ఈ సినిమా గొప్ప విజయం ఇవ్వాలని పనిచేశాం. ఆ విజయం వరిచింది. ఈ సినిమా కోసం పని చేసిన అందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు. జీవితంలో అన్నీ డబ్బుతోనే ముడిపడివుండవు. సల్మాన్‌ఖాన్‌ మాపై ప్రేమ, ఆప్యాయతతో ఈ సినిమా చేశారు. పారితోషికాన్ని కూడా తిరస్కరించారు. అయితే చరణ్ బాబు సల్మాన్ భాయ్ కి తగిన కానుక ఏర్పాటు చేస్తారు. తమన్ సంగీతం ఈ చిత్రానికి ఆరో ప్రాణం. నజభజజజరా పాట ఆలోచన తమన్ దే. అలాగే ఈ సినిమాకి టైటిల్ ఇచ్చింది కూడా తమనే. సత్యదేవ్ అద్భుతమైన నటనతో  ఆకట్టుకున్నారు. గాడ్ ఫాదర్ కు మరో పిల్లర్ గా నిలిచారు. నయనతార తన నటనతో ఎంతో హుందాతనాన్ని తీసుకొచ్చారు. మురళి శర్మ అద్భుతంగా చేశారు. మురళి మోహన్ గారు నాతో పాటు ప్రయాణించే పాత్ర చేశారు. బెనర్జీ చాలా హుందాగా వుండే పాత్ర చేశారు. పూరి జగన్నాథ్ మాపై వున్న ప్రేమతో ఈ సినిమాలో ఒక చక్కని పాత్రలో  కనిపించారు. సునీల్, షఫీ ఇలా అందరూ చక్కని అభినయం కనబరిచారు. అలాగే ప్రభుదేవా కొరియోగ్రఫీని చాలా ఎంజాయ్ చేశాను. ఎక్కడా తప్పుపట్టలేని సినిమా ఇది. నిరవ్ షా అద్భుతమైన కెమరా వర్క్ ఇచ్చారు. చివర్లో వచ్చిన పాటలో చోటా కే నాయడు తన ప్రతిభని చూపించారు. సురేష్ మంచి ఆర్ట్ వర్క్ ఇచ్చారు. సినిమా విడుదలై  బావుందనే టాక్ వచ్చిన తర్వాత ప్రతి మీడియా హౌస్ చిత్రాన్ని చాలా గొప్పగా ప్రొజెక్ట్ చేశాయి. మీడియాకి ప్రత్యేక కృతజ్ఞతలు. పవర్ఫుల్ కంటెంట్ వున్న చిత్రం గాడ్ ఫాదర్. అందుకే అన్ని వర్గాల ప్రేక్షకులని అలరిస్తోంది. నా జీవితంలో అత్యద్భుతమైన చిత్రాలు పదిహేను వుంటే అందులో గాడ్ ఫాదర్ ఒకటి. ఇంత గొప్ప విజయాన్ని ఇచ్చిన ప్రేక్షకులకు మరోసారి కృతజ్ఞతలు,” అన్నారు.

Social Share

Related Posts

Galleries