Sunday - April 2, 2023
Sunday - April 2, 2023

For advertising email us: [email protected]

‘Of the cinema, by the cinema, for the cinema’ is our motto.
We are the all-in-one destination for the cine maniacs.

గాడ్ ఫాదర్ ని ప్రేక్షకులు ఖచ్చితంగా ప్రేమిస్తారు: ప్రెస్ మీట్ లో చిత్ర యూనిట్

Written by:

చిరంజీవి, సల్మాన్ ఖాన్‌ కలసి నటిస్తున్న చిత్రం గాడ్ ఫాదర్. కొణిదెల సురేఖ సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్స్, సూపర్ గుడ్ ఫిలింస్ బ్యానర్ ‌లపై ఆర్‌ బి చౌదరి, ఎన్‌ వి ప్రసాద్ ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా నిర్మిస్తున్నారు. అక్టోబర్ 5న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, హిందీలో గ్రాండ్ గా విడుదల కానున్న నేపధ్యంలో చిత్ర యూనిట్ ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ నిర్వహించింది.

 

ఈ ప్రెస్ మీట్ లో మెగాస్టార్‌ చిరంజీవి మాట్లాడుతూ, “అందరికీ దసరా శుభాకాంక్షలు. అనంతపురంలో జరిగిన ప్రీరిలీజ్ ఈవెంట్ కి వర్షంతో అంతరాయం ఏర్పడింది. అంత వర్షంలో అందరినీ ఉద్దేశించి మాట్లాడి అందరిలో సంతోషం నింపగలిగానని భావిస్తున్నాను. ఆ రోజు సినిమాకి పని చేసిన అందరి గురించీ మాట్లాడే అవకాశం రాలేదు. అందుకే ప్రత్యేకంగా ఈ రోజు ఈ సమవేశం ఏర్పాటు చేయడం ఆనందంగా వుంది. ఇంత ఇమేజ్ వుండి కూడా చాలా సింపుల్ గా ఉంటానని చాలా మంది అంటుంటారు. నాది, నేను అనే ఆలోచన నా జీవితంలో ఎప్పుడూ రాదు. ఒక శిల్పం అందంగా ఉందంటే దాని కారణం ఆ శిల్పం కాదు. ఆ శిల్పం వెనుక చాలా మంది కష్టం వుంటుంది. చిరంజీవి అనే శిల్పం నా సొంతం కాదు. ఎంతో మంది కృషి, వారి గొప్పదనం వలన ఈ ఇమేజ్ వుంది. ఇది నాది అనుకుంటే అది అమాయకత్వమే. అందుకే దాన్ని హృదయంలో ఉంచుకున్నాను తప్ప మైండ్ కి ఎక్కించుకోలేదు. సింపుల్ గా ఉండటానికి ఇదే కారణం అని భావిస్తాను. ఈ సింప్లిసిటీ, వాత్సల్యమే మరింత దూరం ప్రయాణించడానికి దోహదపడుతుందని అనుకుంటాను. వైవిధ్యంగా ఏదైనా చేయలనే ఆలోచన ఎప్పుడూ నా మనసులో వుంటుంది. చరణ్ బాబు నా ఆలోచనలని నిరంతరం పరిశీలిస్తుంటారు. లూసిఫర్ సినిమా గురించి చరణ్ చెప్పినపుడు నిజంగా వైవిధ్యమైన సినిమా, మనంచేయాల్సిన సినిమా అనిపించింది. అయితే లూసిఫర్ చూసినప్పుడు ఎక్కడో చిన్న వెలితి వుండేది. సత్యానంద్, మోహన్ రాజా చేసిన మార్పులతో ఒక తృప్తి కలిగింది. ఈ సినిమా చూస్తున్నపుడు పాటలు, హీరోయిన్ లేదనే ఆలోచనే రాదు. కేవలం క్యారెక్టర్ ని ఫాలో అవుతాం తప్పితే మరో ఆలోచన రానివ్వకుండా అద్భుతంగా డిజైన్ చేశారు మోహన్ రాజా. కథనంని బిగింపుతో నడిపారు. గాడ్ ఫాదర్ ని ప్రేక్షకులు ఖచ్చితంగా ప్రేమిస్తారు. మీ అందరి ఆదరణ పొందుతుందనే నమ్మకం వుంది. ఈ సినిమాకి పని చేసిన నటీనటులు సాంకేతిక నిపుణులందరికీ కృతజ్ఞతలు. మాటల రచయిత లక్ష్మీ భూపాల, డీవోపీ నిరవ్ షా, ఎడిటర్ మార్తాండ్ వెంకటేష్ , ఆర్ట్ డైరెక్టర్ , సురేష్ అందరూ మనసుపెట్టి ప్రేమించి చేశారు. నిర్మాతలు ఆర్ బి చౌదరి, ఎన్ వి ప్రసాద్ గారికి కృతజ్ఞతలు. తమన్ రేయింబవళ్ళు పని చేశారు. అనసూయాతో పాటు మిగతా నటీనటులందరికీ కృతజ్ఞతలు. విజయదశమికి ఈ సినిమా గొప్ప విజయం సాధించాలని, ప్రేక్షకులు ఈ సినిమాని ప్రేమించి గొప్ప విజయం ఇవ్వాలి” అని కోరుకున్నారు.

Social Share

Related Posts

Galleries