Tuesday - March 19, 2024
Tuesday - March 19, 2024
For advertising email us: [email protected]

‘Of the cinema, by the cinema, for the cinema’ is our motto.
We are the all-in-one destination for cine maniacs.

బాయ్‌ఫ్రెండ్ ఫర్ హైర్ న్యూ ఏజ్ కాన్సెప్ట్: చిత్ర యూనిట్

Written by:

విశ్వంత్ దుడ్డుంపూడి, మాళవిక సతీషన్ ప్రధాన పాత్రలలో సంతోష్ కంభంపాటి దర్శకత్వంలో తెరకెక్కిన  రోమ్-కామ్ బాయ్‌ఫ్రెండ్ ఫర్ హైర్ (BFH). స్వస్తిక సినిమా, ప్రైమ్ షో ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకాలపై వేణు మాధవ్ పెద్ది, కె నిరంజన్ రెడ్డి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ నెల 14న చిత్రం విడుదల కానున్న నేపధ్యంలో  చిత్ర యూనిట్ ప్రెస్ మీట్ నిర్వహించింది.

 

విశ్వంత్ దుడ్డుంపూడి మాట్లాడుతూ, ”బాయ్‌ఫ్రెండ్ ఫర్ హైర్ న్యూ ఏజ్ కాన్సెప్ట్. చాలా ఫన్ కాన్సెప్ట్. ఈ సినిమా కోసం రెండేళ్ళు పాటు అంకిత భావంతో పని చేశాం. దర్శకుడు సంతోష్ చాలా హార్డ్ వర్క్ చేశారు. బాయ్‌ఫ్రెండ్ ఫర్ హైర్ పై హైప్ రావడానికి కారణం దర్శకుడు సంతోష్. డీవోపీ బాల వండర్ ఫుల్ విజువల్స్ అందించారు. నిర్మాతలు వేణు మాధవ్ పెద్ది, కె నిరంజన్ రెడ్డి ఎక్కడా రాజీ పడకుండా సినిమా నిర్మించారు.  వారే ఈ సినిమాకి మెయిన్ పిల్లర్స్. వారి వలనే సినిమా ఇంతలా ప్రమోట్ అయ్యింది. గోపి సుందర్ చాలా మంచి సంగీతం అందించారు. కొరియోగ్రఫీ విజయ్ వినయ్ సినిమాలో ఒక స్వాగ్ తీసుకొచ్చారు. ఎడిటర్ విజయ్ వర్ధన్ చాలా చక్కగా కట్ చేశారు. మాళవిక చాలా సపోర్టివ్ గా పని చేశారు. ఈ సినిమాలో పని చేసిన అందరికీ కృతజ్ఞతలు. అక్టోబర్ 14న సినిమా వస్తోంది. అందరూ థియేటర్లో చూసి ఎంజాయ్ చేయాలి,” అని కోరారు.

Social Share

Related Posts

Galleries