Friday - March 29, 2024
Friday - March 29, 2024
For advertising email us: [email protected]

‘Of the cinema, by the cinema, for the cinema’ is our motto.
We are the all-in-one destination for cine maniacs.

బెదురులంక 2012 ఫస్ట్ లుక్ విడుదల

Written by:

కార్తికేయ గుమ్మకొండ కథానాయకుడిగా నటిస్తున్న సినిమా బెదురులంక 2012. ఇందులో డీజే టిల్లు ఫేమ్ నేహా శెట్టి కథానాయిక. క్లాక్స్ దర్శకత్వం వహిస్తున్నారు. లౌక్య ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై ప్రొడక్షన్ నంబర్ 3గా రవీంద్ర బెనర్జీ (బెన్నీ) ముప్పానేని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సి. యువరాజ్ చిత్ర సమర్పకులు. నాచురల్ స్టార్ నాని బెదురులంక 2012 ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా చిత్రనిర్మాత బెన్నీ ముప్పానేని మాట్లాడుతూ “పోస్టర్ చూస్తే బెదురులంక 2012 ఎంత విభిన్నంగా ఉండబోతుందనేది అర్థం అవుతుంది. ఒక పల్లెటూరిలో 2012 యుగాంతం నేపథ్యంలో జరిగే కథతో తీసిన చిత్రమిది. అవుట్ అండ్ అవుట్ ఫన్ ఎంటర్‌టైనర్. కార్తికేయ, నేహా శెట్టి కాంబినేషన్ చాలా కలర్‌ఫుల్‌గా ఉంటుంది. డీజే టిల్లు తర్వాత నేహా నటిస్తున్న చిత్రమిది. షూటింగ్ చివరి దశకు చేరుకుంది. యానాం, కాకినాడ, గోదావరి పరిసర ప్రాంతాల్లో షూటింగ్ చేశాం. ఇందులో ఐదు పాటలు ఉన్నాయి. మెలోడీ బ్రహ్మ మణిశర్మ గారు అద్భుతమైన బాణీలు అందించారు. ఓ పాటను స్వర్గీయ సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు రాశారు. కెమెరా వర్క్ సూపర్ అంటారంతా! ఆర్ట్ వర్క్ కూడా ఫెంటాస్టిక్‌గా ఉంటుంది. డ్రామా, కామెడీ, యాక్షన్, ఎమోషన్స్ సినిమాలో మెయిన్ హైలైట్స్ అవుతాయి. థియేటర్లలో ప్రేక్షకులను బెదురులంక అనే కొత్త ప్రపంచంలోకి సినిమా తీసుకెళ్తుంది. కొత్త కాన్సెప్ట్‌తో రూపొందుతోన్న ఈ చిత్రాన్ని కొత్త ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం” అని చెప్పారు.

Social Share

Related Posts

Galleries