Saturday - May 11, 2024
Saturday - May 11, 2024
For advertising email us: [email protected]

‘Of the cinema, by the cinema, for the cinema’ is our motto.
We are the all-in-one destination for cine maniacs.

థియేటర్లలో డిఫరెంట్ ఎక్స్‌పీరియ‌న్స్‌ ఇస్తుందీ కెప్టెన్ – ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో హీరో ఆర్య

Written by:

ఆర్య కథానాయకుడిగా నటించిన తాజా సినిమా ‘కెప్టెన్’. ఐశ్వర్య లక్ష్మీ, సిమ్రాన్, హరీష్ ఉత్తమన్, కావ్య శెట్టి, గోకుల్ నాథ్ ఇతర ప్రధాన తారాగణం. శక్తి సౌందర్ రాజన్ దర్శకత్వం వహించారు. థింక్ స్టూడియోస్ అసోసియేషన్‌తో నిర్మాణ సంస్థ ది స్నో పీపుల్ పతాకంపై ఆర్య నిర్మించారు. తెలుగులో ఈ సినిమాను శ్రేష్ఠ్ మూవీస్ ద్వారా ప్రముఖ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ & హీరో నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి విడుదల చేస్తున్నారు. సెప్టెంబర్ 8న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సందర్భంగా మంగళవారం హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఫంక్షన్ నిర్వహించారు.

 

హీరో ఆర్య మాట్లాడుతూ ”తెలుగు నా తొలి సినిమా ‘వరుడు’. అందులో అల్లు అర్జున్ గారితో నటించాను. ఆ సినిమా లో  డైలాగులు అన్నీ ప్రోపర్ తెలుగు డైలాగులు. అవి చెప్పడానికి నేను కష్టపడ్డాను. నటుడిగా ఆ సినిమాతో చాలా నేర్చుకున్నాను. అల్లు అర్జున్ గారితో మంచి ఫ్రెండ్షిప్ ఏర్పడింది. సినిమాలకు వస్తే… డిఫరెంట్‌గా చేయకపోతే ఒకే తరహా సినిమాలకు పరిమితం అవుతాయి. కంఫర్ట్ పెరుగుతుంది. నాకు అది ఇష్టం లేదు. ఫెయిల్ అయినా పర్వాలేదు కానీ డిఫరెంట్ ఫిల్మ్స్ చేయాలని అనుకుంటాను. ప్రేక్షకులు కూడా డిఫరెంట్ ఫిల్మ్స్ చూడటానికి ఇష్టపడుతున్నారు. ‘కెప్టెన్’ ఒక డిఫరెంట్ ఫిల్మ్. తెలుగులో సుధాకర్ రెడ్డి గారు విడుదల చేస్తున్నారు. ఈ విషయం సాయేషాకు చెబితే చాలా ఎగ్జైట్ అయ్యింది. ”అయామ్ సో హ్యాపీ. ఇది బ్లాక్ బస్టర్’ అని చెప్పింది. మా సినిమాను విడుదల చేస్తున్న సుధాకర్ రెడ్డి గారికి థాంక్స్. ఈ సినిమాతో ‘విక్రమ్’ సక్సెస్ కంటిన్యూ అవుతుందని ఆశిస్తున్నాను. ఆయన వెరీ పాజిటివ్ పర్సన్. ఆయనతో అసోసియేట్ అవ్వడం అంటే ఆల్రెడీ ఈ సినిమా హిట్. రామజోగయ్య శాస్త్రి గారు అద్భుతమైన లిరిక్స్ రాశారు. కొన్నిసార్లు తమిళ పాటల కంటే తెలుగు పాటలు బావున్నట్లు అనిపించాయి. తెలుగులో రాకీ (రాకేందు మౌళి) డైలాగులు రాశారు. ‘సార్‌ప‌ట్ట‌’ డైలాగులు కూడా అతనే రాశారు. నాకు బాగా నచ్చాయి. అందుకని, ఆ సినిమాకు రాయమని అడిగాను. ‘కెప్టెన్’ అవుట్‌పుట్‌ నాకు నచ్చింది. ఇది నాకు చాలా స్పెషల్ ఫిల్మ్. ఈ సినిమాకు ముందు దర్శకుడు శక్తి సౌందర్ రాజన్ తో ‘టెడ్డీ’ సినిమా చేశా. అతను చాలా బాగా చేశారు. ఇమాన్ సార్ సూపర్బ్ మ్యూజిక్ ఇచ్చారు. శక్తి, ఇమాన్ సార్ కాంబినేషన్ సూపర్ హిట్. నాలుగైదు సినిమాలు చేశారు. ఈ సినిమాకు పాటలతో పాటు అద్భుతమైన నేపథ్య సంగీతం అందించారు. ఐశ్వర్య లక్ష్మీ వెరీ టాలెంటెడ్ యాక్టర్. ఆమె చాలా బాగా నటించారు. సిమ్రాన్ గారు చైల్డ్ హుడ్ క్రష్. నేను మాత్రమే కాదు… మా దర్శకుడు, కెమెరామేన్ అందరూ ఫస్ట్ షాట్ అయిన తర్వాత సెల్ఫీలు తీసుకున్నాం. ఆవిడ షూటింగ్ కు వస్తే… ఫ్యాన్ బాయ్ మూమెంట్ లా ఉండేది. ప్రేక్షకులకు ‘కెప్టెన్’ డిఫరెంట్ ఎక్స్‌పీరియ‌న్స్‌ ఇస్తుంది. సినిమా నిడివి రెండు గంటల లోపే. సెప్టెంబర్ 8న థియేటర్లలో చూడండి” అని అన్నారు.

Social Share

Related Posts

Galleries