Thursday - April 18, 2024
Thursday - April 18, 2024
For advertising email us: [email protected]

‘Of the cinema, by the cinema, for the cinema’ is our motto.
We are the all-in-one destination for cine maniacs.

ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తున్న అరి మూవీ క్యారెక్టర్ ఫస్ట్ లుక్స్

Written by:

అనసూయ భరద్వాజ్, సాయి కుమార్, సుమన్, ఆమని, శ్రీకాంత్ అయ్యంగార్, వైవా హర్ష, శ్రీనివాస రెడ్డి, చమ్మక్ చంద్ర తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా అరి. ఈ చిత్రాన్నిఆర్వీ రెడ్డి సమర్పణలో అర్వీ సినిమాస్ పపతాకంపై శ్రీనివాస్ రామిరెడ్డి, శేషు మారంరెడ్డి నిర్మిస్తున్నారు. పేపర్ బాయ్ సినిమా ద్వారా ప్రతిభ గల దర్శకుడిగా పేరు తెచ్చుకున్న జయశంకర్ రూపొందిస్తున్నారు. ఈ సినిమాలోని ఒక్కో పాత్రను రివీల్ చేస్తున్నారు. ఈ క్యారెక్టర్స్ ఫస్ట్ లుక్స్, వాటి పేర్లు వైవిధ్యంగా ఉండి సినిమా మీద ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తున్నాయి. జలసీ పాత్రలో అనసూయ, ప్రైడ్ గా సాయికుమార్, ఆంగర్ క్యారెక్టర్ లో శ్రీకాంత్ అయ్యంగార్, లస్ట్ గా వైవా హర్ష, గ్రీడీ పాత్రలో శుభలేఖ సుధాకర్, అటాచ్ మెంట్ క్యారెక్టర్ లో సురభి ప్రభావతి నటిస్తున్నారు. వీరి క్యారెక్టర్ ఫస్ట్ లుక్స్ కొత్తగా ఉన్నాయి. మనిషి ఎలా బతకకూడదు అనే విషయాన్ని ఈ సినిమా ద్వారా ఆసక్తికరంగా చూపిస్తున్నారు. ప్రస్తుతం అరి సినిమా చిత్రీకరణ పూర్తి చేసుకుంది. త్వరలో విడుదల తేదీని ప్రకటించనున్నారు.

Social Share

Related Posts

Galleries