Thursday - March 28, 2024
Thursday - March 28, 2024
For advertising email us: [email protected]

‘Of the cinema, by the cinema, for the cinema’ is our motto.
We are the all-in-one destination for cine maniacs.

మాకెప్పటికే స్వీట్ మెమోరీగా గుర్తుండిపోయే స్పెషల్ మూవీ ఉర్వశివో రాక్షసివో: సక్సెస్ సెలెబ్రేషన్స్ లో అల్లు అర్జున్

Written by:

నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో అల్లు శిరీష్, అను ఇమ్మాన్యూల్ జంటగా విజేత సినిమా దర్శకుడు రాకేష్ శశి దర్శకత్వం వహించిన ఉర్వశివో రాక్షసివో చిత్రాన్ని జీఏ-2 పిక్చర్స్‌, ధీరజ్ మొగిలినేని నిర్మించారు. అచ్చు రాజమణి సంగీతం అందించిన ఈ చిత్రానికి విజయ్ ఎం సహనిర్మాతగా వ్యవహారించారు. నవంబర్‌ 4న థియేటర్లో విడుదలైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకొని సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ నేపధ్యంలో హైదరాబాద్ లో చిత్ర యూనిట్ గ్రాండ్ గా సక్సెస్ సెలెబ్రేషన్స్ నిర్వహించింది. ఈ కార్యక్రమానికి అల్లు అర్జున్, నిర్మాత దిల్ రాజు లు ముఖ్య అతిధిలుగా హాజరయ్యారు.

 

అల్లు అర్జున్ మాట్లాడుతూ, “ఇంత పెద్ద హిట్ ఇచ్చిన ప్రేక్షకులకు థాంక్యూ సో మచ్. అందరికీ లైఫ్ ఇచ్చేది డైరెక్టర్. అందరూ బాగా చేసినా డైరెక్షన్ సరిగా చెయ్యకపోతే డెడ్ బాడీ కి డెకరేషన్ చేసినట్లుంటుంది. దర్శకుడు రాకేష్ గారు మాకు మంచి మెమోరబుల్ హిట్ సినిమా ఇచ్చాడు.. ముఖ్యంగా మా నాన్నకు బిగ్ కంగ్రాచులేషన్ చెప్పాలి. ఆయన నా సినిమాలు ఎన్నో చూశారు గాని, శిరీష్ సినిమా ను నిర్మించి శిరీష్ కు మంచి సక్సెస్ ను ఇవ్వడం అనేది తనకు చాలా మెమొరబుల్ గా ఉంటుంది. GA2 బ్యానర్ పెట్టిన మా బన్నీ వాసు చెప్పినట్టు నేను, వాసు, వాసు నేను అనేది వేరు కాదు మా ఇద్దరం ఒకటే.ఈ విషయంలో మా నాన్నకి ఎంత రేటింగ్ ఇస్తానో వాసుకు కూడా అంతే రేటింగ్ ఇస్తాను. తనెప్పుడూ నాగురించే ఆలోచిస్తుంటాడు. GA2 బ్యానర్లో ఎన్నో మంచి సినిమాలు చేసి పెద్ద విజయం సాదించాడు. తను ఇలాగే మంచి మంచి సినిమాలు తీసి సక్సెస్ చేయాలని కోరుతున్నాను. ఈ సినిమాకు పనిచేసిన టెక్నిషియన్ అందరూ చాలా బాగా వర్క్ చేశారు. కెమెరామెన్ పని తీరు, ఎడిటింగ్ పరంగా, మ్యూజిక్ పరంగా ఇలా అందరూ బాగా చేశారు వారందరికీ కంగ్రాచులేషన్. ఇందులో సునీల్, వెన్నెల కిషోర్ లు చాలా బాగా చేశారు. అను మంచి కథను ఎన్నుకుని సక్సెస్ అయింది. మా తమ్ముడు గురించి మాట్లాడాలి. నా సినిమా సక్సెస్ అయినా నేను ఇంత హ్యాపీగా ఉండేవాడిని కాదేమో.. మా తమ్ముడు సినిమా సక్సెస్ అయినందుకు చాలా హ్యాపీగా ఉంది. శిరీష్ నువ్వు ఏం చేయక పోయినా పర్లేదు ఐ లవ్ యు. హిట్ కొట్టినా కొట్టక పోయినా నువ్వు నాకు ఆల్వేస్ సక్సెస్పుల్. ప్రతి ఒక్కరూ ఈ సినిమాలో శిరీష్ పర్ఫార్మెన్స్ బాగుందని చెప్తా ఉంటే చాలా హ్యాపీగా ఉంది. తను ఇలాగే మంచి, మంచి సినిమాలు చేసుకుంటూ పోవాలి. అందరూ పుష్ప గురించి అడుగుతున్నారు. వారికి చిన్న అప్ డేట్ ఇస్తాను. పుష్ప వన్ తగ్గేదే లే అయితే.. పుష్ప 2 అస్సలు తగ్గేదేలే. నేను కూడా ఈ సినిమా కొరకు చాలా ఎగ్జైట్మెంట్ గా వెయిట్ చేస్తున్నాను” అన్నారు.

Social Share

Related Posts

Galleries