ఉగ్రం షూటింగ్ నుండి ప్రారంభమైయిందని ఒక గింప్స్ వీడియోతో ప్రకటించారు నిర్మాతలు. ముఖానికి నల్లటి మాస్క్ లా రంగు, అల్లరి నరేష్ క్లోజ్అప్ లో కళ్ళని అటు ఇటు తిప్పి దేనికోసమో వెతకడం, ఒక చోట చూపు నిలపడం, కళ్ళు ఎర్రగా మారడం.. ఇలా చాలా టెర్రిఫిక్ గా వుంది గింప్స్ వీడియో. వీడియో లో వినిపించిన నేపధ్యం సంగీతం కూడా ఎమోషన్ ని మరింత ఎలివేట్ చేసింది. టైటిల్ కి తగ్గట్టుగా ఈ గ్లింప్స్ వీడియో అల్లరి నరేష్ పాత్ర ఉగ్రరూపాన్ని తెలియజేస్తుంది.