Friday - April 19, 2024
Friday - April 19, 2024
For advertising email us: [email protected]

‘Of the cinema, by the cinema, for the cinema’ is our motto.
We are the all-in-one destination for cine maniacs.

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం నవంబర్ 25న విడుదల

Written by:

అల్లరి నరేష్ తాజా చిత్రం ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం. ఏఆర్ మోహన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని  జీ స్టూడియోస్‌ తో కలిసి హాస్య మూవీస్‌పై రాజేష్ దండా నిర్మిస్తున్నారు.

 

ఈ చిత్రంలో అల్లరి నరేష్‌  గిరిజన ప్రాంతమైన మారేడుముల్లిలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొకోని ఎన్నికల విధులు నిర్వహించే ప్రభుత్వ అధికారిగా ఇంటెన్స్ పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమా విడుదల కొంచెం ఆలస్యమౌతుంది. నవంబర్ 11న కాకుండా 25వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలౌతుంది.

 

ఆనంది కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో వెన్నెల కిషోర్, ప్రవీణ్, సంపత్ రాజ్ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రానికి శ్రీచరణ్ పాకాల సంగీతం అందిస్తున్నారు. రాంరెడ్డి సినిమాటోగ్రాఫర్ గా పని చేస్తున్నారు. అబ్బూరి రవి మాటలు అందించగా,  బ్రహ్మ కడలి ఆర్ట్ డైరెక్టర్ గా, చోటా కె ప్రసాద్ ఎడిటర్ గా పని చేస్తున్నారు.

Social Share

Related Posts

Galleries