Wednesday - April 17, 2024
Wednesday - April 17, 2024
For advertising email us: [email protected]

‘Of the cinema, by the cinema, for the cinema’ is our motto.
We are the all-in-one destination for cine maniacs.

డైరెక్టర్ బాబి చేతుల మీదుగా సీఎస్ఐ సనాతన్ టీజర్ విడుదల

Written by:

చాగంటి ప్రొడ‌క్ష‌న్ లో ఆది సాయికుమార్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా సీఎస్ఐ సనాతన్. ఈ చిత్రంలో క్రైమ్ సీన్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస‌ర్ గా ఆదిసాయికుమార్ ఒక కొత్త రోల్ లో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నాడు. క్రైమ్ బ్యాక్ డ్రాప్ లో  గ్రిప్పింగ్ థ్రిల్ల‌ర్గా
రూపొందుతున్న ఈ సినిమా టీజర్ ను తాజాగా ప్రముఖ దర్శకుడు బాబి విడుదల చేశారు. టీజర్ బాగుందన్న ఆయన చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు.

 

ఈ టీజర్ ఎలా ఉందో చూస్తే…, విక్రమ్ అనే ప్రముఖ పారిశ్రామికవేత్త యువకుడి హత్య కేసును ఛేదించేందుకు రంగంలోకి దిగిన క్రైమ్ సీన్ ఆఫీసర్ గా ఆది సాయి కుమార్ ఇంటెన్స్ పర్మార్మెన్స్ చూపించారు. ఒక హత్య జరిగిందంటే హంతకుడు తప్పకుండా ఉంటాడు. ఐదుగురు అనుమానితులు ఐదు డిఫరెంట్ వెర్షన్స్ వినిపిస్తున్నారు. వాటిలో ఏది నిజం అనేది ఆయన విచారణలో తెలుసుకునే క్రమం ఆసక్తిగా ఉండనుంది.

 

తుది మెరుగులు దిద్దుకుంటున్న ఈ సినిమాను త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని చిత్రబృందం తెలిపారు.

 

Social Share

Related Posts

Galleries