Thursday - April 18, 2024
Thursday - April 18, 2024
For advertising email us: [email protected]

‘Of the cinema, by the cinema, for the cinema’ is our motto.
We are the all-in-one destination for cine maniacs.

ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి మంచి కంటెంట్ వున్న సినిమా: ప్రీరిలీజ్ ఈవెంట్ లో చిత్ర యూనిట్

Written by:

సుధీర్ బాబు, దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటి కాంబినేషన్ లో విలక్షణమైన ప్రేమకథగా వస్తున్న చిత్రం”ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ సెప్టెంబర్ 16న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్‌ అవుతుంది. ఈ చిత్రంలో సుధీర్ బాబుకు జోడిగా డాజ్లింగ్ బ్యూటీ కృతిశెట్టి కనిపించనుంది. నిర్మాతలు బి మహేంద్రబాబు, కిరణ్ బళ్లపల్లి బెంచ్‌మార్క్ స్టూడియోస్‌పై మైత్రీ మూవీ మేకర్స్‌తో కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గాజులపల్లె సుధీర్ బాబు చిత్రాన్ని సమర్పిస్తున్నారు. ఈ చిత్రం ప్రీరిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. హీరోలు నాగ చైతన్య, అడవి శేష్, సిద్ధు జొన్నలగడ్డ, దర్శకులు హరీష్ శంకర్, అనిల్ రావిపూడి,  రాహుల్ సాంకృత్యాన్, వెంకీ కుడుమల, అవసరాల శ్రీనివాస్, నటులు శ్రీనివాస్ రెడ్డి, రాహుల్ రామకృష్ణ, శ్రీనివాస్ వడ్లమాని, శ్రీకాంత్ అయ్యంగార్  తదితరులు ఈ వేడుకకు హాజరయ్యారు.

 

సుధీర్ బాబు మాట్లాడుతూ.. ”ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ కథ విన్న వెంటనే నచ్చేసింది. ఇందులో ఒక ఫిల్మ్ డైరెక్టర్ గా చేస్తున్నాను. ప్రతి డైరెక్టర్ కి ఒక టేస్ట్ వుంటుంది. దాన్ని తిక్క అని కూడా అనొచ్చు. ఈ సినిమాలో నా పాత్ర ఎంత ముఖ్యమో కృతిశెట్టి పాత్ర కూడా అంతే ముఖ్యం. అందరూ ఈ సినిమాతో కనెక్ట్ అవుతారు. ఇంద్రగంటి గారితో ఇది మూడో సినిమా. ఆయన నాకు ఒక బిగ్ బ్రదర్. ఆయన కథలకు నన్ను నమ్మారు. ఈ సినిమానే మా కాంబినేషన్ ని తీసింది. ఆయన అన్నీ జోనర్స్ చేశారు. కృతిశెట్టి ఈ సినిమా తర్వాత తన స్థానం మరింత సుస్థిరం చేసుకుంటుంది. పీజీ విందా గారితో మూడో సినిమా ఇది. అద్భుతంగా చూపించారు. నిర్మాతలు బి మహేంద్రబాబు, కిరణ్ బళ్లపల్లి ఎక్కడా రాజీపడకుండా సినిమా తీశారు. వివేక్ సాగర్ చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు. మార్తండ్ కే వెంకటేష్, సాహి సురేష్, మిగతా టెక్నిషియన్లు అందరికీ థాంక్స్. ఈ వేడుకు వచ్చిన నాగ చైతన్య, అడవి శేష్, సిద్ధు జొన్నలగడ్డ, హరీష్ శంకర్, అనిల్ రావిపూడి, రాహుల్ సాంకృత్యాన్, వెంకీ కుడుమల అందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు. కృష్ణంరాజు గారు ఆశీస్సులు మనందరిపై ఎప్పుడూ వుంటాయి. ఆయన గర్వపడే చేయడం ప్రభాస్ ఒక్కరి బాధ్యతే కాదు మనందరి భాద్యత. ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ మంచి కంటెంట్ వున్న సినిమా. మంచి సినిమాని ప్రేక్షకుల చేతుల్లో పెడుతున్నాం. మంచి కథ, కంటెంట్, సినిమాని చూశామని ఫీలై మళ్ళీ మళ్ళీ సినిమాని చూస్తారనే నమ్మకం వుంది. సెప్టెంబర్ 16న థియేటర్లో ఈ సినిమా చూడండి, మీ స్పందనని తెలియజేయండి” అన్నారు

 

నాగచైతన్య మాట్లాడుతూ.. ”ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ టీం నాకు చాలా ఇష్టం. ఇంద్రగంటి గారి వర్కింగ్ స్టయిల్ గురించి విన్నాను. ఆయనతో కలసి పనిచేయాలని కోరుకుంటున్నాను. ట్రైలర్ నాకు చాలా నచ్చింది. సుధీర్ తో ఏం మాయ చేశావే లో కలిసి పని చేశాను. సుధీర్ ఆల్ రౌండర్. కృతిశెట్టి చాలా హార్డ్ వర్కింగ్ చేస్తోంది. నిర్మాతలు కిరణ్, మహేంద్ర, సుధీర్ బాబు, మైత్రీ మూవీ మేకర్స్ కి ఆల్ ది బెస్ట్. సినిమా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను” అని అన్నారు.

 

మోహనకృష్ణ ఇంద్రగంటి మాట్లాడుతూ.. “ఇది నాకు స్పెషల్ మూవీ. ఇష్టపడి రాసుకున్న కథ. కమర్షియల్ డైరెక్టర్స్ కి ఈ సినిమా ఒక ట్రిబ్యుట్ అని చెప్తాను. అనిల్ రావిపూడి, హరీష్ శంకర్ నన్ను దీవించారు. వెల్ కమ్ టు ది ఫ్యామిలీ అన్నారు. విందా, వివేక్ సాగర్, కాసర్ల శ్యాం, మార్తండ వెంకటేష్, రామజోగయ్యా శాస్త్రీ గారితో పని చేయడం ఎప్పుడూ ఆనందంగా వుంటుంది. ఈ సినిమాతో సాహి సురేష్ లాంటి మంచి ఆర్ట్ డైరెక్టర్ కూడా తోడయ్యారు. మహేంద్ర, కిరణ్ బెంచ్ మార్క్ లో ఈ సినిమా మంచి మెట్టు అవ్వాలని కోరుకుంటున్నాను. మైత్రీ మూవీ మేకర్స్ కి కృతజ్ఞతలు. నాగచైతన్య, అడవిశేస్, సిద్దు జొన్నల గడ్డ కి స్పెషల్ థాంక్స్. రాహుల్ సాంకృత్యాన్, వెంకీ కుడుమల, అవసరాల శ్రీనివాస్ కి కూడా కృతజ్ఞతలు. సుధీర్ బాబు అద్భుతమైన నటుడు. హరీష్ శంకర్ చెప్పినట్లు ఆయన బలానితగ్గ కథలు ఇవ్వాలేకపోతున్నాం. సుధీర్ బాబుతో ఈ సినిమా చేయడం చాలా గర్వంగా వుంది. మహేష్ బాబు గారు ఈ సినిమా చూసి తప్పకుండా గొప్పగా ఫీలౌతారు. ఉప్పెనకి ముందే కృతిశెట్టిని ఈ సినిమా కోసం ఎంపిక చేశాను. ఇందులో సరికొత్త కృతిశెట్టిని చూస్తారు. ఇందులో కృతి నటన చూసి ఆశ్చర్యపోతారు. ఈ సినిమాలో పని చేసిన అందరికీ కృతజ్ఞతలు. సెప్టెంబర్ 16న సకుటుంబ సపరివార సమేతంగా మంచి హాస్యం, రోమాన్స్ ని ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నాను” అని అన్నారు.

 

అడవిశేష్ మాట్లాడుతూ.. “నిర్మాతలు కిరణ్, మహేంద్ర, సుధీర్ బాబుకు గుడ్ లక్. ఇంద్రగంటి గారు మా డైరెక్టర్. ఆయనకి  2008లో నా షార్ట్ ఫిలిం ఒక్క కాపీ ఇచ్చాను. కానీ ఇప్పటివరకూ తిరిగి ఇవ్వలేదు. వివేక్ సాగర్ సంగీతం అంటే నాకు ఇష్టం. సుధీర్ అంటే నాకు గౌరవం. గూడాచారి సినిమాలో యంగ్ అడవి శేష్ సుధీర్ గారి అబ్బాయే. ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ సెప్టెంబర్ 16న కుమ్మేస్తుంది. థియేటర్లో కలుద్దాం” అన్నారు

Social Share

Related Posts

Galleries