రుద్రంగి ఫస్ట్ లుక్ ని చిత్రబృందం విడుదల చేయగా, అందులో నటుడు జగపతి బాబుని భీకరంగా, జాలి-దయ లేని భీమ్ రావ్ దొర గా పరిచయం చేసారు. ఉత్కంఠ పెంచేలా ఉండే నేపథ్య సంగీతం తో తీసుకెళుతూ, “రుద్రంగి నాది, రుద్రంగి బిలాంగ్స్ టూ మీ” అని జగపతి బాబు చెప్పే డైలాగ్ ఆకట్టుకుంటుంది.
రుద్రంగి చిత్రంలో జగపతి బాబుతో పాటు ఆశిష్ గాంధీ, గానవి లక్ష్మణ్, విమలా రామన్, మమతా మోహన్ దాస్, కాలకేయ ప్రభాకర్, సదానందం తదితరులు నటిస్తున్నారు. అజయ్ సామ్రాట్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా, సంతోష్ శనమోని సినిమాటోగ్రఫీ, బొంతల నాగేశ్వర్ రెడ్డి ఎడిటింగ్ మరియు నాఫల్ రాజా ఐఏఎస్ సంగీతం అందిస్తున్నారు.