విశ్వక్ సేన్ నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న సినిమా దాస్ కా ధమ్కీ. 95% చిత్రీకరణ పూర్తయింది. మిగిలిన భాగాన్ని ఒక వారంలో పూర్తి చేయనున్నారు. బల్గేరియన్ ఫైట్ మాస్టర్స్ టోడర్ లాజరోవ్-జుజితో చిత్ర బృందం సినిమా క్లైమాక్స్ ఫైట్‌ను చిత్రీకరిస్తోంది. హైదరాబాద్‌లోని సారధి స్టూడియోస్‌లో వేసిన భారీ సెట్లో షూటింగ్ జరుగుతోంది.